అంబరీష్ కు తీరని రెండు కోరికలు…. అవేంటి తెలిస్తే షాక్ అవుతారు!

0
229
ప్రముఖ కన్నడ నటులు మరియు రాజకీయ నాయకులు అయిన రెబల్ స్టార్ అంబరీష్, నిన్న బెంగళూరులో హార్ట్ అటాక్ తో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక అయన మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ మరియు నటులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే అయన మరణం విషయాన్ని తెలుసుకున్న కోలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక నిన్న రజినీకాంత్, సుహాసిని, రాధికా, చిరంజీవి, సురేష్, నరేష్, కమల్ హాసన్, జయప్రద వంటి సీనియర్ నటులు అంబరీష్ మృతదేహానికి నివాళులు అర్పించి, అయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఇకపోతే అంబరీష్ గారు ఎప్పటినుండో కోరుకుంటున్న రెండు ,కోరికలు తీరకుండానే నింగికేగారని సమాచారం. అవి ఏంటంటే, మొదటిది అయన ఎప్పటినుండో కళాకారుల ఐక్య వేదిక పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి, వారికి ఒక భవనాన్ని కానుకగా ఇవ్వాలని భావించి, కొన్నాళ్ల క్రితం ఎంతో శ్రమించి వేదికను ఏర్పాటు చేసి, అలానే కొన్ని విరాళాలు సేకరించి వారికి అన్నివిధాలుగా సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించి కానుకగాఇచ్చారు.
అయితే ఇంతవరకు బాగానే వున్నా, ఆ భవనంలో కళాకారులందరితో కలిసి ఎంతో వైభవంగా కన్నడ రాజ్యోత్సవ వేడుకలు జరపాలని భావించిన అంబరీష్, ఎట్టకేలకు వాటికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. అయితే మొన్న అనుకోకుండా మండ్య జిల్లాలో రాజ్యోత్సవ వేడుకలకు బయల్దేరిన కళాకారుల బస్సు పాండవపుర తాలూకా కాలువలో పడి మునిగిపోవడంతో కొందరు ఆ ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటన విషయం తెలుసుకున్న అంబరీష్, వేడుకలను దగ్గరుండి వాయిదా వేయించారు. వెంటనే అంటే, ఆ కళాకారుల ప్రమాద ఘటన జరిగిన కొన్నిగంటల్లోనే అంబరీష్ హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందడం అందరిని కలిచివేసింది. ఇక కళాకారుల ప్రమాద విషయం పై అంబరీష్ నిన్నటినుండి ఎంతో ఆవేదన చెందారని, నిజానికి కళాకారులకు ఇలా అవ్వడం తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని, భార్య సుమలత మరియు కొందరు సన్నిహితులవద్ద ఆయన బాధ పడ్డారట.
అయితే అనుకోకుండా అయన మరణించడంతో కొన్నాళ్లవరకు ఆ వేడుకలు జరిగే పరిస్థితులు కనపడడం లేదు. ఇకపోతే ఇటీవల తాను నటించిన సినిమాల్లో తనకు వయసయిందని కొందరు ప్రేక్షకులు పరోక్షంగా చెప్పుకుంటున్నారు అనే విషయం తన వద్దకు రావడంతో, ఇకపై సినిమాలు చేయలేనని, అంతేకాక తన కుమారుడు హీరోగా ఇటీవల సినిమాను కూడా ప్రాంరంభించారు అంబరీష్. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పూర్తికాకుండానే అంబరీష్ మరణించడం ద్వారా ఇలా ఒకవైపు రాజ్యోత్సవ వేడుకలను, మరోవైపు కుమారుడిని తెరపై చూడాలన్న కోరికలు రెండూ తీరకుండానే అయన వెళ్లిపోవడం బాధాకరమని పలువురు అయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here