అంబరీష్ భార్య సుమలత నిజ స్వరూపం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
319
నిన్న హఠాన్మరణం చెందిన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మరణం పై ప్రజలు సహా పలువురు ప్రముఖులు సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్, మోలీవుడ్, బాలీవుడ్ నుండి కొందరు నటులు ఆమెకు ఫోన్ ద్వారా కూడా తమ నివాళులు తెల్పుతున్నారట. అయితే నిజానికి ఎన్నాళ్ళో కలిసి నటించి ఆపై ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమలత పర్సనల్ లైఫ్ గురించి తెలిస్తే కొంత ఆశ్చర్యం వేయకమానదు. సుమలత తల్లితండ్రులది గుంటూరు జిల్లా బేతపూడి కుగ్రామం. అయితే కొన్నాళ్ళకు ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా చెన్నైకి మకాం మార్చడంతో ఆమె అక్కడే జన్మించారు. మొదటినుండి చదువులలో మంచి చలాకీగా వుండే సుమలత గారు చిన్నపుడు స్కూల్ లో చదివే సమయంలో స్టేజి ప్రోగ్రామ్స్ వంటివి చేస్తూ ఎంతో చలాకీగా ఉండేవారట. అయితే తాను కాలేజీ లో చదువుతున్న రోజుల్లో ఆమెకు నటన పట్ల ఆసక్తి కలగడంతో తన తండ్రి ప్రోత్సాహంతో మెల్లగా సినిమా అవకాశలకోసం ప్రయత్నించారు. అయితే అనుకున్నట్లుగా ముందుగా ఆమెకు కన్నడ సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఇక అప్పటినుండి మెల్లగా ఆమె కన్నడంలో  పెద్ద స్టార్ల సినిమాల్లో కూడా నటించడం  మొదలెట్టారు. ఆపై తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఆ సమయంలో ఆమె కొంత ఆచితూచి మంచి పాత్రలు ఎంచుకుని మాత్రమే చేసేవారట. అలా తెలుగులో ఆమె చేసిన శుభలేఖ, స్వయంకృషి, ఖైదీ, రాజాధిరాజు, వేట సినిమాల్లో చేసిన పాత్రలు మనకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.
అయితే 1987లో లెజెండరీ దర్శకుడు పద్మరాజన్ తెరెకెక్కించిన తూవనతుంబికల్ అనే సినిమాలో క్లారా పాత్ర ఆమెకు తమిళ నాట మంచి గుర్తింపు తెచ్చిన పాత్ర అని చెప్పుకోవాలి. అలా మెల్లగా సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్న సుమలత హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపుగా అందరూ అగ్రనటులతోను నటించి మెప్పించారు. ఇక అదే సమయంలో కన్నడనాట హీరోగా కొనసాగుతూ మంచి ఫామ్ లో వున్న అంబరీష్ తో ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడం, అది మెల్లగా ప్రేమగా మారి చివరకు పెళ్ళికి దారి తీసింది. నిజానికి తనకు సుమలత కేవలం సహధర్మచారిణి మాత్రమే  కాదు, తన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఒక మంచి స్నేహితురాలు అని కూడా అంబరీష్ ఎపుడూ చెపుతుంటారు. ఇక అయన మరణంతో ఒక్కసారిగా కుంగిపోయిన సుమలతను చూసిన వారందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు కూడా అయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here