అత్తాపూర్ హత్య కేసు నిందితులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
198
ఇటీవల హైదరాబాద్ నగరవాసులను భయకంపితులను చేసిన అత్తాపూర్ హత్య ఉదంతంతో ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆ హత్యలో పాల్గొన్న ఇద్దరు నిందితులను పోలీసులు   అదుపులోకి తీసుకుని కోర్ట్ లో ప్రవేశపెట్టగా కోర్ట్ వారికీ ప్రస్తుతానికి రిమాండు విధించింది. అంతేకాదు త్వరలోనే వారికి కఠిన శిక్ష కూడా పడనున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు బాగున్నా, ఇటీవల వారిద్దరూ కోర్ట్ లో బెయిల్ కి అప్లై చేయగా, కోర్ట్ వారికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వారిద్దరూ చక్కగా బయట చెట్టపట్టాలు వేసుకుని హాయిగా తిరుగుతున్నారట. ఇక ఇటువంటి ఘటనలను బట్టి చూస్తుంటే మన దేశంలో చట్టాలు ఎంతబాగా అమలు అవుతున్నాయో అర్ధం అవుతోంది. నిజానికి పట్టపగలు, అది కూడా జనావాసాల మధ్య, ప్రజలు అందరూ ఉలిక్కిపడేలా ఎంతో క్రూరంగా ఒక వ్యక్తిని తరిమి తరిమి హత్య చేసిన ఆ నిందితులను ఇద్దరినీ అసలు బయటకు వదలడం ఏమిటని, అసలు మన దేశంలో చట్టాలు ఉన్నాయా, కోర్ట్ లు ఎందుకు ఇటువంటి వారిపట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే నిజానికి మన రాజ్యాంగంలోని చట్టాల్లో ఎటువంటి కేసులో అయినా, దాదాపుగా కొన్ని సెక్షన్ల ప్రకారం బెయిల్ మంజూరు  చేయవచ్చని,అయితే అటువంటి వారికి బెయిల్ వచ్చి, వారు జైలు నుండి బయటకు వచ్చిన తరువాత కూడా పూర్వంలా ప్రవర్తించి ఇంకెవరికీ హాని తలపెట్టరని ఎలా చెప్పగలం అనేది మరికొఇందరి వాదన. దీన్నిబట్టి చూస్తుంటే, నిజానికి మన చట్టాలే నేరస్థులకు చాలావరకు మేలు చేసే చుట్టలుగా వ్యవహరిస్తున్నాయని, కావున మన చట్టాల్లో మరిన్ని కఠినతరం మార్పులు చేస్తేనేకాని, ఇటువంటి తప్పులు చేయడానికి ప్రజలు భయపడతారని, పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏమంటారు ఫ్రెండ్స్, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరి…..