అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ రివ్యూ : సినిమాకు వస్తున్న టాక్ పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మూవీ టీమ్!

0
199
రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాపై చాలావరకు పాజిటివ్ టాక్ వస్తున్నట్లు సినీవర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాని నిన్న ప్రివ్యూ చూసిన కొందరు సినీ పెద్దలు కూడా సినిమా చాలా బాగుంది అంటున్నారు. నేడు ఉదయం బెనిఫిట్ షో ను చూసిన రవితేజ అభిమానులు చెపుతున్న టాక్ ప్రకారం సినిమా మంచి హిట్ అయ్యే అవకాశం ఉందని అర్ధం అవుతోంది. మూవీ మొత్తం ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ తో ముందుకు సాగుతుందట. ఇక సినిమాలో రవితేజ మూడు రకాల షేడ్స్ వున్న పాత్రల్లో నటించి మరొక్కసారి తన అభిమానులను అలరించాడని అంటున్నారు.
తన సినిమాల్లో కామెడీని మాత్రం మిస్ అవ్వని శ్రీను వైట్ల, ఇందులో కూడా తన మార్క్ కామెడీ సన్నివేశాలతో ఆడియన్స్ తో నవ్వులు పూయించారట. ఈ సినిమాలో సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ లపై మంచి ఫన్నీ కామెడీ సీన్స్ రాయించారని అంటున్నారు. ఇకపోతే సినిమా ప్రారంభం బాగుందని, ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు సాంగ్స్ చిత్రీకరణ పరంగా ఆకట్టుకుంటాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. అంతేకాదు ఆ సీన్ తో ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది అని టాక్. ఇక సెకండ్ హాఫ్ కొంతవరకు సాగతీసినట్లు అనిపించినా ఒక 40 నిమిషాల తరువాత మంచి ట్రాక్ లోకి వస్తుందని, ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు ఫైట్స్, మరియు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణమని అంటున్నారు.
నిజానికి ఇదివరకు వచ్చిన పాతకథల మాదిరి రేవెంజి డ్రామానే అయినప్పటికీ, శ్రీను వైట్ల సినిమాను నడిపిన తీరుకు ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని అంటున్నారు. ఇక సినిమాకి అమర్, అక్బర్, ఆంటోనీ పాత్రల్లో నటించిన రవితేజ పెద్ద ప్లస్ అని, ఇలియానా పెర్ఫార్మన్స్ అదిరిందని, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రాఫర్ కెమెరా పనితనం, ఎడిటింగ్, ఆకట్టుకునే కామెడీ సీన్స్ వెరసి ఈ సినిమాని మంచి హిట్ గా నిలుపుతాయని బెనిఫిట్ షో చూసిన వారు అంటున్నారు. అయితే మరి నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇకముందు ఎటువంటి టాక్, కలెక్షన్లు సంపాదించి ముందుకు వెళ్తుందో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వేచిచూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here