అమృత నిజస్వరూపాన్ని బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న ప్రణయ్ తల్లి!

0
278
కొన్నాళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరంగా హత్యకు గురైన ప్రణయ్ మరణాన్ని తలుచుకుంటే ఇప్పటికీ మన మనసు చలించిపోతుంది. ఇక ప్రణయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత తండ్రి మారుతీరావు, ఒక వ్యక్తికి దాదాపు కోటి రూపాయల సుపారీ ఇచ్చి మరీ, అత్యంత కిరాతకంగా ప్రణయ్ ని హత్య చేయించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయమై అరెస్ట్ అయిన మారుతీ రావు ఇటీవల పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తానే కావాలని ప్రణయ్ ని హత్య చేయించినట్లు ఒప్పుకోవడంతో అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. తన కూతురుతో 9వ తరగతి నుండి ప్రేమ వ్యవహారం కొనసాగించిన ప్రణయ్, ఎన్ని సార్లు చెప్పినా వినలేదని, అంతేకాక మాకు ఎవరికి చెప్పకుండా ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో బాధను, ద్వేషాన్ని కల్గించిందని, అందుకే తాను ప్రణయ్ ను హత్య చేయించినట్లు చెప్పాడు మారుతీ రావు. ఇక ప్రస్తుతం అమృత, ప్రణయ్ తల్లితండ్రుల వద్దనే ఉంటోంది.
అయితే నిజానికి ప్రణయ్ తల్లితండ్రులు అమృతను మరొక పెళ్లి చేసుకోమన్నప్పటికీ కూడా తన జీవితానికి ప్రణయ్ మిగిల్చిన గుర్తుగా ఒకబిడ్డ తన కడుపులో పెరుగుతున్నాడు, ఈ జన్మకు అది చాలు అని చెప్తూ మరొక పెళ్లిచేసుకోవడానికి నిరాకరించిందట. ఇక ఈ విషయమై ప్రణయ్ తల్లి కొంత ఉద్వేగభరితంగా మాట్లాడినట్లు సమాచారం. అమృత నిజంగా తమకు కోడలు కాదని, ఒక కూతురువంటిదని ఆమె చెప్తోందట. నిజానికి ఆలా చిన్నవయసులోనే ఏ అమ్మాయికైనా భర్త అనుకోకుండా చనిపోతే, చాలామంది ఎక్కువగా తమ పుట్టింట్లోనే ఉంటారని, అంతేకాక కొద్దిరోజులకు ఆ బాధనంతా మర్చిపోయి ఏ మాత్రం పట్టనట్లు తమ స్వప్రయోజనాల కోసం మరొక పెళ్లి చేసుకుంటారని, అయితే అమృత అలా చేయకుండా, తమ గురించి, తమ కుటుంబం గురించి అలోచించి, ఇక్కడకు వచ్చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమని అంటోందట.
అంతేకాదు అమృతకు ప్రస్తుతం 8వ నెల అని, ఇటువంటి సమయంలో స్త్రీ ఎంతో ఓర్పు, సహనంతో మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలని, అయితే అమృత మాత్రం ఇప్పటికీ ప్రణయ్ నే రోజూ తలచుకుంటూ తన మనసు అనవసరంగా పాడుచేసుకుంటోందని ఒకరకంగా ఆవేదన చెందుతోందట. ఇక ఇటీవల అమృతను డాక్టర్ కు చూపిస్తే ఆమెను ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దని, మంచి ఆహారం, వేళకు నిద్ర ఉండాలి అని చెప్పారని, అందుకే అమృతను ఇకనైనా తన ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం చక్కగా చూసుకోమని, అలానే ఇకపై ఎక్కువగా ప్రణయ్ ని తలుచుకుని బాధపడొద్దని చెప్పారట. కాగా ప్రస్తుతం అమృతపై ఆమె అత్త చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారగా, పలువురు నెటిజన్లు అమృత గొప్పతనాన్ని మెచ్చుకుంటూ అభినందనలు కామెంట్ రూపంలో తెలియచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here