అమృత పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందొ తెలుసా…చూస్తే కన్నీళ్లు ఆగవు!

0
159
ఇటీవల నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణంగా హత్య చేయబడిన ప్రణయ్ ఘటనను ఇప్పటికీ తెలుగు ప్రజలు మరచిపోలేకపోతున్నారు అనే చెప్పాలి. 9వ తరగతిలోనే తాను ప్రణయ్ ని ప్రాణప్రదంగా ప్రేమించానని, మొదటినుండి మా ప్రేమ గురించి మా తల్లితండ్రులకు తెలుసునని, ఇక చివరికి ఎన్నివిధాలా నచ్చచెప్పినా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాం అని అమృత చెప్పిన విషయం తెలిసిందే. ఆ కక్షతోనే ప్రణయ్ ని మా నాన్న చంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కూడా. ఇక ప్రస్తుతం అమృత తన అత్తమామల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఆపై కొన్నాళ్ల తరువాత ఏదైనా ఉద్యోగం చూసుకుని తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాను అంటోంది. ఇకపోతే ఇంట్లో అమృత రోజూ కొంత ఆవేదనకు గురవుతోందని, సరిగ్గా భోజనం చేయకపోవడం, నిద్రపోకపోవడం చేస్తోందని ఆమె అత్తమామలు చెపుతున్నారు. అంతేకాక చనిపోయిన ప్రణయ్ ని తలుచుకుని పదే పదే బాధపడుతోందని, అసలు ఈ విధంగా జరుగుతుందని తెలిస్తే, ప్రణయ్ ని అసలు పెళ్లి చేసుకునేదానిని కాదని బాధపడుతోందట.

అయితే తనవల్లనే ప్రణయ్ తన తల్లితండ్రులనుండి దూరమయ్యాడని, లేకపోతే హాయిగా తాను జీవిస్తూ ఉండేవాడిని అని తనలో తానే మధనపడుతోందట. ఇక అమృత మొదటినుండి చాలా సున్నిత మనస్కురాలని, ఏ చిన్న సమస్య వచ్చినా ఎంతో ఆందోళన చెందే అమృతకు, ఆ దేవుడు ఇంత పెద్ద కష్టం కలిగించడంతో కుమిలిపోతోందని, తాను ప్రణయ్ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని, అతడు లేని జీవితం ఎంతో నరకంగా ఉందని ప్రణయ్ హత్య తరువాత పలుమార్లు తన తల్లికి చెప్పుకుని ఏడ్చిందట. కాగా ఆమెను ఇకపై ప్రణయ్ ని గుర్తుచేసుకోవద్దని ఎంత చెప్పినా వినడం లేదని, అదీ కాక ప్రణయ్ ని పూర్తిగా మర్చిపోయి మరొక వివాహం చేసుకోమన్నప్పటికీ కూడా తమ మాట వినడం లేదని అంటున్నారట ఆమె అత్తమామలు. చనిపోయిన ప్రణయ్ నిజంగా ఎంతో అదృష్టవంతుడిని, ఇటువంటి అమ్మాయి తనకు భార్యగా దొరకడం అతడి అదృష్టమని, ఇక అత్తామామాలుగా మేము ఆమెను దేవుడిచ్చిన కూతురిగా భావిస్తున్నామని వారు చెప్తున్నారట.