అరవింద సమేతలో ఆ మూడు సీన్లు సినిమాలో హైలైట్ అట!

0
272

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య ఎల్లుండి అరవింద సమేత సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటినుండో వీరిద్దరి కలయికలో సినిమా కోసం అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూడ సాగారు. అయితే ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది. సినిమా అద్భుతంగా ఉందని, సినిమా చూసాక త్రివిక్రమ్ గారు ఈ స్టయిల్లో కూడా అద్భుతంగా సినిమా తీయగలరా అంటూ అందరూ అనుకుంటారని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు సమాచారం.

ఇక కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సినిమా మొత్తంలో వచ్చే ఒక మూడు సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించనున్నాయట. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ బాగుంటుందని, ఇక పాటలు అయితే సందర్భాన్ని బట్టి వస్తాయని, కొంత వయోలెన్స్ ఉన్నప్పటికీ, అది కూడా అవసరం మేరకే ఉంటుందని అంటున్నారు. ఇకపోతే సినిమాలో ప్రీ ఇంటర్వెల్ సీన్ సినిమాకే హై లైట్ అట, అంతేకాదు సెకండ్ హాఫ్ లో ఒక 45 నిమిషాల తరువాత వచ్చే ఒక యాక్షన్ సన్నివేశం అద్భుతంగా ఉంటుందని, ఇక ప్రీ క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని, క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు.

దీన్నిబట్టి చూస్తుంటే, సినిమాలో వచ్చే ఆ మూడు సన్నివేశాలు కనుక రేపు విడుదల తరువాత బాగా క్లిక్ అయితే మాత్రం సినిమాకు తప్పకుండా సూపర్ హిట్ టాక్ రావడం ఖాయమని చెపుతున్నారు. మొత్తంగా చూస్తే, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అరవింద సమేత గాలి బాగా వీస్తోంది కనుక, సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల దుమ్ము దులపడం ఖాయం అని అర్ధం అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here