అరవింద సమేత చూసి ఎన్టీఆర్ కి ఫోన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ఏమన్నారో తెలుసా!

0
403
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, అదే అరవింద సమేత. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కంబోలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, కొందరు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మహర్షి సినిమా కోసం అమెరికా వెళ్లిన మహేష్ బాబు, తన కుటుంబంతో కలిసి నేటి తెల్లవారుఝామున అరవింద సమేత ప్రీమియర్ షో చూసారట. సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు, నమ్రత ఇద్దరు కూడా సినిమా సూపర్బ్ గా ఉందని, ప్రస్తుతం మంచి హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ కు ఇది మరొక హిట్ ని చెప్పారట.
ఇక సినిమా చూసిన వెంటనే మహేష్ బాబు, ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడారట. సినిమాలో నీ నటన, ఇక త్రివిక్రమ్ గారి టేకింగ్ అదరహో అనేలా ఉన్నాయని, సినిమా చూస్తున్నంత సేపు అందులోని నటులు కాకుండా పాత్రలు మాత్రమే ప్రేక్షకుడికి కనపడుతాయని అన్నారట. సినిమాలో తారక్ డాన్సులకు తాను ఫిదా అయ్యానని, మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయని, ఇక పెనీవిటి సాంగ్ తన మనసుని హత్తుకుందని మహేష్ అన్నారట. ఇకపోతే సినిమాలో యాక్షన్ పార్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఒక ఫీస్ట్ లా ఉంటుందని, ఇక త్రివిక్రమ్ గారి డైలాగులు అద్దిరిపోయారని పొగిడారట. సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదని, అలా సినిమా మొత్తాన్ని త్రివిక్రమ్ గారు ఒక ఫ్లోలో తీసుకెళ్లిన విధానం బాగుందని అన్నారట.
ఇక సినిమాలో ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ వుందని, మనకు సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఆ పాత్రలు మన మనసులో గుర్తుండిపోతాయని మహేష్ చెప్పినట్లు సమాచారం. మొత్తానికి తాను ఆశించినట్లు త్రివిక్రమ్ – తారక్ కంబినేషన్ లో వచ్చిన ఈ అరవింద సమేత మంచి విజయాన్ని అందుకున్నందుకు తనకు చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఇక ప్రస్తుతం మహేష్ బాబు అరవింద పై చేసిన ప్రశంసలపై పలువురు నెటిజన్లు, హ్యాట్సాఫ్ మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here