అరవింద సమేత తనను షాక్ కు గురిచేసింది అంటున్న లక్ష్మి ప్రణతి!

0
353
మొన్నటివరకు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ బన్నిలతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన త్రివిక్రమ్ ఎట్టకేలకు ఎన్టీఆర్ తో తీసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. అయితే మొదటి నుండి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసారు. ఇక మొత్తానికి ఈ సినిమా రూపుదిద్దుకుని నేడు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అంచనాలు విపరీతంగా వున్నాయి. ఇక ఇప్పటికే నేటి ఉదయం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పడిన బెన్ఫిట్ షోలను బట్టి వస్తున్న రిపోర్టులను బట్టి చూస్తుంటే సినిమా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న నిర్వహించిన ఈ సినిమా ప్రీమియర్ షో చూసి బాగా ఎంజాయ్ చేసినట్లు ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. తనకు త్రివిక్రమ్ సినిమాలంటే బాగా ఇష్టమని, అయితే ఎప్పుడు తన భర్త ఎన్టీఆర్, త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తారా అని తాను కూడా ఎదురుచూసానని ప్రణతి చెప్పిందట.
ఇకపోతే సినిమా మొత్తం తనకు బాగా నచ్చిందని, సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగులు  మరియు పంచులు తనకు బాగా నచ్చాయని, ఇక సునీల్ కామెడీ, ఎన్టీఆర్ పలికించిన యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ఆకట్టుకున్నట్లు చెప్పిందట. సినిమాలో పాటలు విన్నపుడు సినిమాలో ఏదో తెలియని మెసేజ్ ఉంటుందని తనకు అనిపించిందని, అయితే అందరూ అనుకున్నట్లుగా త్రివిక్రమ్ గారు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ గా సినిమాను తెరకెక్కించడం నిజంగా అభినందించదగ్గ విషయం అని అన్నదట. ఇక ముఖ్యంగా ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ని ప్రేక్షకులకు, అది కూడా నేటి ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడం కొంత కష్టం అని, అయితే దానిని అధిగమించి, నేటి ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్లు దర్శకత్వం వహించిన అయన ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాలని ఆమె అన్నారట. దీన్నిబట్టి చూస్తే ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్నట్లు త్రివిక్రమ్, తారక్ కాంబినేషన్ మూవీ అరవింద సమేత, తనకు బాగా నచ్చిందని లక్ష్మి ప్రణతో చెప్పినట్లు తెలుస్తోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here