అరవింద సమేత పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

0
326
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసందే. ఇక ఇప్పటికే సినిమాని చూసిన కొందరు ప్రేక్షకులు సినిమాపై మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ ఫేవరెట్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమాని చూసి, తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి అందరివలె తాను కూడా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని, అయితే ఎన్నో ఏళ్ళ కల నేటికీ నెరవేరినందుకు తనకు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పారట రాజమౌళి.
నిజానికి తనకు సినిమా కథ తారక్ ముందే చెప్పారని, కథ విన్న తనకు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం అప్పుడే కలిగిందని రాజమోళి అన్నారట. ఇకపోతే అందరూ ఎదురు చూస్తున్న రోజు రావడంతో, అందరికంటే ముందుగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన రాజమౌళి, ఎన్టీఆర్-త్రివిక్రమ్ లపై ప్రశంశల జల్లు కురిపించారట. తారక్ లోని అన్ని కోణాలను అనగా ఎమోషన్స్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ తదితర అన్నివిషయాలను బాగా బయటకు తీసి చూపించారని, ఈ సినిమాతో తారక్ రేంజ్ మరింత పెరుగుతుందని రాజమౌళి అన్నారట. అంతేకాదు, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ తనను బాగా ఆకట్టుకుందని,
ఇక అవసరం మరియు సందర్భాన్ని బట్టి వచ్చే త్రివిక్రమ్ గారి డైలాగులకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పవలసిందే అని అన్నారట. ఇకపోతే సినిమాలో పూజ నటన కూడా తనకు బాగా నచ్చిందని, ఇక సునీల్ కామెడీ క్యారెక్టర్ అదిరిపోయిందని, ఈ సినిమాతో సునీల్ కి మళ్ళి బ్రేక్ రావడం ఖాయమని అన్నారట. సినిమా మొత్తాన్ని త్రివిక్రమ్ గారు ఒక వేవ్ లెంగ్త్ ప్రకారం నడిపిన తీరుకు ఫిదా అయ్యానని, సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ అంటూ కితాబిచ్చారట దర్శక ధీరుడు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి చూస్తుంటే, మన రాజమౌళి గారికి ఈ అరవింద సమేత వీర రాఘవుడు మాత్రం బాగా నచ్చినట్లు తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here