అరవింద సమేత మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాక్ అవుతారు!

0
322
ఎన్నో ఏళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కల నేటికీ నెరవేరింది. అయన హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎపుడు సినిమా చేస్తారా అని ఫ్యాన్స్ ఎన్నోయేళ్ల నుండి ఎదురుచూపులు చూడసాగారు. ఇక ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చి, నేడు అది అరవింద సమేత రూపంలో అది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నేడు విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసందే. ఇకపోతే ఈ సినిమా బెనిఫిట్ షో నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా ఒక ఎబోవ్ యావరేజ్ సినిమా అని, ఒకరకంగా ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన దమ్ము, మరియు ప్రభాస్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమాలను కలిపి తీసిన సినిమాలా ఉందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే అందరూ ఊహించినట్లు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, మొదటి రోజు కలెక్షన్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అని చెప్పాలి. 
ప్రస్తుతం మూవీ ట్రేడ్ అనలిస్టులు చెప్తున్న ప్రకారం సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు వసూచేసినట్లు తెలుస్తోంది. ఇది ఒకరకంగా ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ అని, నైజాం, సీడెడ్, ఆంధ్ర, ఓవర్సీస్ సహా అన్ని చోట్ల కూడా మంచి కలెక్షన్లే వచ్చినట్లు దీన్ని బట్టి తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి తొలిరోజు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసందే. అయితే ప్రస్తుతం దసరా సెలవలు కావడంతో ఇక రేపటినుండి ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎక్కువగానే వస్తారని, ఎందుకంటే ఇటీవల విడుదలైన సినిమాల్లో ఏది కూడా హిట్ కాకపోవడం, అలానే ఇంకొక వారం వరకు కూడా మరొక సినిమా విడుదల కూడా లేకపోవడంతో ఈ వారం రోజులు అరవిందకు బాగా కలిసివస్తాయని అర్ధం అవుతోంది. మరి ఈ వారం రోజుల్లో అరవింద సమేత ఎంత మేర కలెక్షన్లు సంపాదించి, ఏ స్థానంలో నిలుస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఓపికపట్టవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here