అర్జున్ కపూర్ పెళ్లితో శ్రీదేవి ఫ్యామిలిలో పెద్ద చిచ్చు రేగడం ఖాయమా ?……!

0
245
దివంగత బాలీవడ్ నటీమణి శ్రీదేవి మరణంతో మన దేశం సహా దేశదేశాల్లో వున్న ఆమె అభిమానులందరూ ఒక్కసారిగినా శోకసంద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి చనిపోయిన తరువాత అప్పటివరకు వారి కుటుంబసభ్యుల మధ్యన వున్న గొడవలు అన్నీ సర్దుకున్నాయని, అంతకముందు బోనీ కపూర్ పెద్ద కూతురు జాన్వీ మరియు కొడుకు అర్జున్ కపూర్ లు, శ్రీదేవి కూతురైన ఖుషిని సరిగ్గా పట్టించుకునేవారు కాదని, అందువల్ల వారి కుటుంబంలో కొన్ని కలతలు రేగాయని అప్పట్లో కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాల్లో విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం మరొక్కసారి ఇటుంవటి పరిస్థితులే వారి ఫ్యామిలిలో కనపడుతున్నాయని అంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. అయితే దానికి ప్రధాన కారణం అర్జున్ కపూర్ పెళ్ళి వ్యవహారమేనని వినికిడి.
నిజానికి గత కొద్దిరోజలుగా అర్జున్ మరియు అర్భాజ్ ఖాన్ భార్య మలైకా అరోరా ఖాన్ ల మధ్య ప్రేమాయణం సాగుతోందని, ఇటీవల వీళ్లిద్దరు కలిసి తిరగడం కొన్నిసార్లు అక్కడి స్థానిక మీడియా కంట పడడంతో, ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2017లో అర్భాజ్ తో విడాకులు తీసుకున్న మలైకా, అప్పటినుండి అర్జున్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోంది. అయితే ఈ వార్త నిజమేనని బోనీ కపూర్ బంధువులు కొంతమంది చెపుతున్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్ళికి మొదటినుండి జాన్వీ కపూర్ మరియు ఖుషి ఒప్పుకోవడం లేదని, మలైకాకు ఇదివరకే పెళ్లి అయిందని, అదీ కాక ఆమె ముస్లిం అయినకారణంగా ఆమెను పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని అక్కచెల్లెళ్ళిద్దరూ అర్జున్ కు ఖరాఖండిగా తేల్చి చెప్పారట. కాగా ఈ విషయం తెలిసిన బోనీ కూడా కొడుకుని ఆమెను పెళ్లి చేసుకోవద్దని కొంత వారించారని, అయినప్పటికీ వినని అర్జున్, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని పక్కాగా నిర్ణయించాడట.
ఒకవేళ వారి పెళ్లి కనుక జరిగితే మరొక్కసారి శ్రీదేవి కుటుంబం రెండుగా చీలడం ఖాయమని, అనంతరం జాన్వీ మరియు ఖుషి వారి కుటుంబానికి పూర్తిగా దూరం అవుతారని అంటున్నారు. కాగా ప్రస్తుతం అక్కడి మీడియా వర్గాల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తున్న ఈ వార్తపై కొందరు నెటిజన్లు అర్జున్ అలా చేయడం తప్పు అని విముఖత వ్యక్తం చేస్తుంటే మరికొందరేమో, అర్జున్ కు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, అతని లైఫ్ పార్టనర్ గా నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు ఎవరికీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here