ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జగన్ పై దాడి చేసిన నిందితుడు

0
178
రెండు రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత, వైసిపి నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం గావించబడ్డ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాస్ అనే వెయిటర్ జగన్ తో సెల్ఫీ పేరుతో వచ్చి ఆయనపై కత్తి దూయడంతో, అది జగన్  భుజానికి తగిలి చిన్నపాటి గాయం అయింది. అనంతరం హైదరాబాద్ చేరుకున్న జగన్, గాయానికి సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే డాక్టర్లు ఆయనకు మూడు రోజుల బెడ్ రెస్ట్ అవసరమని చెప్పడంతో లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేరుకున్న జగన్, అక్కడ అభిమానులు మరియు కార్యకర్తలతో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగింపుపై చర్చించారు. అయితే జగన్ పై జరిగిన ఈ హత్యాయత్నాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇక నిందితుడు శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడి జేబులోనుండి ఒక 9 పేజీల లేఖని స్వాధీనం చేసుకున్నారు. కొందరేమో అతడు జగన్ అభిమాని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది ముమ్మాటికీ టీడీపీ వారి పనే అని, ఎవరికి వారే తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తపరుస్తున్నారు. అయితే నిందితుడు శ్రీనివాస్ విషయమై ప్రస్తుతం ఒకవార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అది ఏమిటంటే, మొన్నటినుండి పోలీస్ కస్టడీలో వున్న శ్రీనివాస్, వారి వేధింపులకు తట్టుకోలేక నేడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్లు సమాచారం. నిజానికి శ్రీనివాస్, తాను చేసిన పనికి తన కుటుంబ సభ్యుల పరువు పోయిందని మొన్నటినుండి విపరీతంగా ఆవేదన చెందుతున్నాడని,
మరోవైపు ఇలా నువ్వు దాడి చేయడం వెనుక ఎవరు వున్నారు అంటూ పోలీసులు అతనిని విపరీతంగా టార్చెర్ చేస్తున్నారని, అందుకే ఆ బాధను తట్టుకోలేక కాసేపటి క్రితం శ్రీనివాస్ తన మొలతాడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడట. కాగా అది గమనించిన జైలు సిబ్బంది వెంటనే జైలు గది ఓపెన్ చేసి, అతడిని సమీప హాస్పిటల్ కు తరలించారని, అయితే ఈ విషయం బయటకు వస్తే మీడియా వారు రచ్చ రచ్చ చేస్తారనే భయంతో విషయాన్ని బయటకు రానీయలేదని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారిన ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే మాత్రం పోలీసులనుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడవలసిందే…..