ఆయుష్షుకు, సెక్స్ కు వున్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
321
నేటి కాలపు మానవుడు కల్తీ ఆహారం, మరియు సురక్షితం లేని నీరు, అన్నిటికంటే ముఖ్యంగా కలుషితమైన గాలిని పీల్చడం వలన తన జీవన ప్రమాణాన్ని రోజురోజుకు తగ్గించుకుంటూ వెళ్తున్నాడు అనే చెప్పాలి. ఇక మనలో ఎక్కువమంది అనేక రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు వున్నారు. వారిలో అనేకులు సమయానికి నిద్ర పట్టని కారణంగా బాధపడుతూ రకరకాల మందులు మింగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అయితే ఇటువంటి వాటికీ ఎక్కువగా చెక్ పెట్టె అంశం ఒకటి ఉందని, ఇటీవల కొందరు సైంటిస్టులు కనిపెట్టారు. అది ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా రోజూ సెక్స్ చేస్తారో, అటువంటి వారిలో హృద్రోగ సమస్యలు, మరియు మానసిక ఒత్తిడికి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం చాలావరకు తక్కువని తేలిందట. నిజానికి మనలో చాలా మంది సెక్స్ అంటే ఏదో ఒక మాములు రోజువారీ పని మాదిరిగా భావిస్తారు.
అలా కాకుండా భార్య భర్తలిద్దరూ సెక్స్ ని ఒక మంచి భావ ప్రాప్తిని అనుభవిస్తూ జరిపితే, ఇద్దరికీ సమానంగా తృప్తి కలిగి శరీరంలోని ప్రధాన అవయవాలు తేలికపడతాయని, అంతేకాదు ముఖ్యంగా ఎవరైతే రోజులో ఎక్కువసార్లు సెక్స్ చేస్తారో వారు మరింత ఆరోగ్యంగా వుండే అవకాశం ఉందని తేలినట్లు చెప్పారు. మరొక విషయం ఏమిటంటే, మనిషి ఏదైనా ఒక పనిని మరింత తృప్తి మరియు ఆనందంతో అనుభవిస్తూ చేస్తే మెదడు విశ్రాంతిని పొంది, గుండె వేగంగా పనిచేస్తూ ఉంటుందని, తద్వారా అటువంటివారు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉందని చెపుతున్నారు. ఇక సెక్స్ ఎక్కువగా జరిపిన కొందరు యువతీయువకుల్లో ఈ విషయం కనపడిందని వారు చెపుతున్నారు. ఇక సెక్స్ చేయని ఎక్కువమంది వారిలో ఒత్తిడి తగ్గకపోవడం, నిరాశ నిస్పృహలకు గురయి తద్వారా జీవితాన్ని ఛిద్రం చేసుకోవడం వంటివి చేస్తుంటారని, అది ఒకరకంగా మన ఆయుష్షుకు తీవ్ర ముప్పుగా కూడా పరిణమిస్తుంది. సో విన్నారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసి మీ ఆయుష్షును మరింత పెంచుకొండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here