ఆలీతో సరదాగా షోలో గీత సింగ్, జ్యోతిలు చెప్పిన షాకింగ్ నిజాలు…. వింటే ఆశ్చర్యపోతారు!

0
330
ప్రస్తుతం టెలివిజన్ ఛానల్స్ ఎవరికి వారు రకరకాల వినూత్నమైన కార్యక్రమాలతో వీక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొన్ని షోలు సక్సెస్ అయితే, మరికొన్ని మాత్రం ఫెయిల్ అవుతుంటాయి. ఇక ఈటివి ఛానల్ లో కొన్నాళ్ల నుండి ప్రసారమవుతూ అటు వీక్షకుల నుండి క్రేజ్ మరియు మంచి టిఆర్పిలతో దూసుకుపోతున్న షో ఆలీ తో సరదాగా. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి వారం వారం ఎవరో ఒక ఫిలిం సెలబ్రిటీ వచ్చి, వారి జీవిత అనుభవాలు పంచుకుంటూ, షోలో సరదా సరదాగా కబుర్లు చెపుతూ పాల్గొనడం జరుగుతుంది. ఇక ఈ షోలో భాగంగా రేపటి వారం ప్రసారం కానున్న  కార్యక్రమానికి, టాలీవుడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ మరియు లేడీ కమెడియన్ గీత సింగ్, అలానే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి, వీరిద్దరూ రేపటి వారం షోకి రాబోతున్న సందర్భంగా, దాని తాలుకు ప్రోమోని ఆ ఛానల్ వారు కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ప్రోమోలో మాణిక్య వీణ మందార పువ్వా సాంగ్ తో వారిద్దరికీ షోలోకి ఆహ్వానం పలుకుతాడు ఆలీ. ఇక మీ ఇద్దరిలో ముందు ఎవరు ఇండస్ట్రీకి వచ్చారు అని ఆడగడంతో, ఆ ఇద్దరూ మౌనంగా వుండి నవ్వడంతో, ఓహో! వయసు తెలిసిపోతుందనా అని ఆలీ అనడంతో షోలో ఒక్కసారిగా నవ్వులు పూస్తాయి.
ఇక గీత సింగ్ పెళ్లి, పీటలవరకు వెళ్లి ఆగిపోయిన విషయాన్నీ అలీ అడగడంతో, నన్ను పెళ్లిచేసుకున్న తరువాత నా కుటుంబాన్ని, మరియు అన్నయ్యను వదిలి రమ్మన్నారు, ఒకవేళ పెళ్లి తరువాత నా భర్త చనిపోతే అన్నయ్య నాకు తోడునీడగా నిలవరా అని వారికి సమాధానం ఇచ్చి, పెళ్లి కాదనుకుని వచ్చేసాను అని చెపుతుంది. ఇక జ్యోతికి పెళ్లి అయిందా అని అడగ్గా అయింది, కానీ నాకు ఇటీవల భర్త నుండి విడాకులు కూడా అయ్యాయి అని చెప్పడంతో షోలోని వారందరూ కొంత నిశ్శబ్దం వహిస్తారు. అయితే ఒకానొక సమయంలో మా బిడ్డను పలకరించడానికి కూడా ఇబ్బందిపడ్డ నా భర్తను చూసి తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. ఇక ఈ విధంగా నవ్వులు, బాధల మిళితంగా ఈ ప్రోమో సాగుతుంది. దీన్నిబట్టి చూస్తే వచ్చేవారం ప్రసారం కానున్న షో తాలూకు ఈ ప్రోమో మంచి హైప్ ని తీసుకువచ్చింది అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here