ఇంటర్వ్యూ సమయంలో అధికారి అడిగిన వింత ప్రశ్నకు….. ఆ అమ్మాయి ఏవిధంగా బదులిచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
257
నిజానికి చదువు విషయంలో మనలో చాలామందికి లోలోపల చెప్పుకోలేని కొన్ని భయాలు ఉంటాయి. అయితే కొందరు వాటిని బయటకు కనపడకుండా దాస్తే, మరికొందరు మాత్రం చీటికిమాటికి భయపడుతూ వాటిని బయటపెట్టుకుంటుంటారు. అయితే అటువంటి భయాలను తరిమికొట్టి ధైర్యంగా ముందుకు సాగగలిగితే ఎంతటివారికైనా విజయం సాధించడం తథ్యం అనేది ఒప్పుకోవాల్సిన విషయం. ఇక చదువుకునే సమయంలో మాత్రం ఎంతో శ్రద్ధగా చదివి, చివరికి పరీక్షలు వచ్చేసరికి మాత్రం ఎనలేని భయాన్ని బయటపెడుతుంటారు ఇంకొంతమంది. అదే పోటీ పరీక్షలకు విపరీతంగా ప్రిపేర్ అయ్యేవారిలో ప్రిపరేషన్ విషయంలో ఉండే ధైర్యం,  పరీక్షకు కూర్చుకునే సమయంలో ఉండదు, అయినప్పటికీ మరికొందరు ఎంతో పట్టుదలతో పరీక్షల్లో విజయవంతంగా పాల్గొంటారు. ఇక పరీక్ష ఫలితాలు వచ్చాక ఇంటర్వ్యూ లో పాల్గొనడం మరొక పెద్ద సమస్య. అయితే ఈ పోటీ పరీక్షల్లో ఐఏఎస్ మరియు ఐపీఎస్ వంటివి మరింత కష్టతరమైనవి అని చెప్పాలి.
అయితే  ఇప్పుడు మనం చెప్పుకునే ఒక అమ్మాయి, ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ పరీక్ష పాసయింది. ఇక ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయిన ఆ అమ్మాయి, కృతనిశ్చయంతో ఇంటర్వ్యూ సమయంలో అక్కడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మొదలెట్టింది. అయితే అనుకోకుండా ఒక అధికారి ఆమెను మరింత పరీక్షించాలని తలచి, ఆమెకు ఒక వింత ప్రశ్నను సంధించారు. అదేమిటంటే, ఒకవేళ మీకు ఇదివరకే పెళ్లి అయి, మీ భర్త చనిపోతే, ఆతరువాత మీకు రెండవ పెళ్లి కనుక జరిగిందనుకోండి, కానీ అనుకోకుండా ఒకరోజు చనిపోయిన భర్త తిరిగివస్తే, రెండవ భర్తకు మీరేమి సమాధానం చెపుతారు అని ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్న విన్న అమ్మాయి, ముందు కొంత ఆలోచనలో పడ్డది, అయినా చనిపోయిన మనిషి తిరిగి రావడం ఏంటి, ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అని తలచి, కాసేపటికి ఈ విధంగా సమాధానం చెప్పింది.
సర్, మన దేశంలో ఇద్దరు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరొక పెళ్లి చేసుకోవాలంటే వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఉండాలి, అలానే యుక్త వయసులో వున్న భార్య భర్తల్లో ఎవరో ఒకరు అనుకోకుండా చనిపోయినట్లైతే మిగిలిన వారు మరొక పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ భర్త లేదా భార్య మరొక వివాహం చేసుకోవడానికి మరణించిన వారి  తాలూకు డెత్ సర్టిఫికెట్ కావాలి కదా అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టసాగారట. నిజానికి ఒకవేళ చనిపోయిన భర్త తిరిగివస్తే, అతడు చనిపోయాడు అని ధృవీకరించే డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాకనే రెండవ పెళ్లి చేసుకున్నాను అని చెప్పవచ్చు అనేది దాని అర్ధం. ఇక ఆ ప్రశ్నని ఆమె సమయస్ఫూర్తిని తెలుసుకుందామని అడిగానని సదరు అధికారి చెప్పారు. ఆమె ఒక వేళ ఈ ఇంటర్వ్యూ లో ఉతీర్ణత సాధించి జాబ్ సంపాదిస్తే, రాబోయే రోజుల్లో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి రావచ్చు, అటువంటప్పుడు ఆమె మనసు ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో తెలుసుకోవడానికె తాను ఈ ప్రశ్న అడిగినట్లు చెప్పాడు ఆ అధికారి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here