ఇంట్లో అమృత బిహేవియర్ చూసి షాకైన ప్రణయ్ తండ్రి!

0
394
కొన్నాళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య గావించబడ్డ ప్రణయ్ ఉదంతాన్ని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేకపోతున్నారు అనే చెప్పాలి. ప్రణయ్ హత్య తరువాత అనేకమంది ప్రజలు మారుతీరావు పై విరుచుకుపడ్డారు. ఎంత ప్రేమపెళ్లి చేసుకుంటే మాత్రం, సొంత అల్లుడిని హత్య చేయిస్తారా అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రణయ్ హత్య తరువాత అతడి భార్య అమృత కు చాలావరకు మద్దతు కూడా లభించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రణయ్ కుటుంబానికి కొంత ఆర్ధిక సాయం చేసి తమ వంతు సహకారాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే అమృత తీరును తప్పుబట్టినవారు కూడా లేకపోలేదు. చిన్నవయసులో ప్రేమలు ఏంటని,  చిన్నప్పటినుండి ఎంతో అల్లారుముద్దుగా కనీ, పెంచిన తల్లితండ్రుల ప్రేమను గుర్తించలేని అమృత లాంటి అమ్మాయిలను క్షమించకూడదని ఆమె తీరును కూడా తప్పుబట్టిన వారున్నారు.
ఇకపోతే ప్రణయ్ మరణాంతరం ప్రణయ్ ఇంట్లోనే అతని తల్లితండ్రులతో పాటు ఉంటున్న అమృత తీరును చూసి ఆమె అత్త, మామలు ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం. నిజానికి ప్రణయ్ మరణం తరువాత అమృతను తన పుట్టింటికి వెళ్ళమని మేము చెప్పాము, అయినప్పటికీ పుట్టినిల్లయినా, మెట్టినిల్లైనా నాకు ఇదే అని అమృత మా దగ్గర ఉంటోందని వారు చెప్పారు. ఇక అమృత తమ ఇద్దరినీ ఎంతో ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటోందని, తామిద్దరికి సమయానికి కావలసినవి అందిస్తూ ఎంతో సేవచేస్తోందని, తనని చూస్తుంటే మాకు కూతురు లేని లోటు తీరిపోయిందని చెపుతున్నారట. నిజానికి ఇంత మంచి మనసున్న అమ్మాయిని మావాడు పెళ్లి చేసుకోవడం అభినందించదగ్గ విషయమని వారు అంటున్నట్లు సమాచారం. 
ప్రణయ్ ని మొదట్లో ప్రేమించి, తరువాత ఇల్లు వదిలి వచ్చిన ఈ అమ్మాయి అసలు మాతో ఇమడగలదా అని అనుకున్నామని, అయితే మొదటి నుండి అమృత ఎంతో అణకువతో మెలిగేదని, ఇక ప్రణయ్ హత్యానంతరం ఆమెకు మాపై ప్రేమ మరింత పెరిగిందని, నిజంగా అటువంటి అమ్మాయిని కన్న మారుతీరావు దంపతులు ధన్యులు అని అంటున్నారు. అయితే ఈ విధంగా ప్రణయ్ తల్లితండ్రులు అమృతపై ప్రశంశల జల్లు కురిపిస్తుండడంతో అమృత తీరుని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here