ఇంట్లో ఉపాసన నిజస్వరూపం చూస్తే షాక్ అవ్వాల్సిందే!

0
190
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా ఆనందంగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఆయనకు మగధీర తరువాత అంత జెన్యూన్ గా హిట్ దక్కింది మాత్రం రంగస్థలం తోనే అని చెప్పుకోవాలి. ఇకపోతే, అయన ఇంత ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం అయన భార్య ఉపాసన కూడా ఒక కారణమని అర్ధం అవుతోంది. ఇక విషయంలోకి వెళితే, ఎవరి జీవితంలో అయినా, బయట ఎన్ని పనులు, సమస్యలు ఉన్నా, సాయంత్రం ఇంటికి చేరేసరికి మాత్రం ఇంటి వాతావరణం ఆనందంగా వుండి, భార్య తనకు మంచి తోడ్పాటు అందిస్తే మాత్రం ఆ భర్త జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే చరణ్ భార్య ఉపాసన కూడా ఆయనకు ఇంట్లో మంచి తోడ్పాటుగా ఉండి, ఇంట్లోని సమస్యలన్నీ తానై సరిదిద్దుతుందట.
ఇకపోతే ఉపాసన, చరణ్ కు సంబందించిన కొన్ని పర్సనల్ విషయాలైన కాస్ట్యూమ్స్, మనీ వ్యవహారాలు, మరియు ఇతరత్రాలు కూడా దగ్గరుండి చూసుకుంటారట. దీనితో ఎప్పుడు తన షూటింగ్స్ తో బిజీ గా వుండే చరణ్ కు చాలావరకు శ్రమ తగ్గడం, తద్వారా అయన ప్రశాంతంగా ఉండడం జరుగుతుందట. ఇక అంతేకాక, ఆమె మావయ్య చిరంజీవిగారు, మరియు అత్తయ్య సురేఖ గారికి కూడా అన్నిపనుల్లో ఎంతో తోడ్పాటుగా ఉంటూ, వారికి తనవంతుగా వీలైన సాయాన్ని అందిస్తుందని తెలుస్తోంది. ఇకపోతే మొదటినుండి ఉపాసనకు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయడం అలవాటని, ఆమె పుట్టింట్లో కూడా ఇంట్లోని ప్రతిపనిలోను తనవంతుగా సాయం అందిస్తూ ఉంటారట,
అదే అలవాటుతో ఆమె అత్తవారింట్లో కూడా అన్నివిధాలా కోడలి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంవల్లనే చరణ్ సహా, వారి ఫ్యామిలీలోని వారందరు కూడా ఎంతో హ్యాపీగా ఉంటారని తెలుస్తోంది. ఇకపోతే నాగబాబు, పవన్ కళ్యాణ్ ల కుటుంబాలకు కూడా ఉపాసన తనవంతు తోడ్పాటు అందిస్తుంటారని, ఆమెగురించి బాగాతెలిసిన దగ్గరివారు, ఆమె ఎంతో సహనశీలి, మరియు ఓర్పు గల వ్యక్తి అని చెపుతుంటారు. దీన్నిబట్టి చూస్తుంటే, ఇంట్లో ఇల్లాలు ఇంటిని ఇలా ఎప్పుడు సుఖసంతోషాలతో చూసుకుంటుంటే అందరూ ఎప్పుడు ఆనందంగా వుంటారు అని చెప్పుకోవడానికి చరణ్ ఫ్యామిలీనే ఉదాహరణగా చెపుకోవచ్చు……..