ఇంట్లో యాంకర్ సుమ నిజస్వరూపం చూస్తే దిమ్మతిరుగుతుంది!

0
188

టెలివిజన్ తెరపై ప్రదర్శితమయ్యే షోలలో ఎక్కువగా పేరుగాంచిన యాంకర్లు పాల్గొనే షోలకే రేటింగ్స్, వీక్షకుల మద్దతు ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఎక్కువగా పాపులర్ యాంకర్లు అయితే షోని బాగా నడిపించగలరు,మరియు షోలో తమ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటుంటారని అందహరి నమ్మకం. ఇకపోతే, ప్రస్తుతం వున్న యాంకర్లలో ఎక్కువగా పేరు మరియు రెమ్యూనరేషన్ తీసుకునేది మాత్రం సుమ అనే చెప్పుకోవాలి. అయితే సుమ సెట్లో ఎంతో చలాకీగా ఉంటూ, తాను చేసే ప్రోగ్రామ్ లోని యూనిట్ వారందరితో ఇట్టే కలిసిపోతారట. ఇకపోతే ఆమె ఇంట్లో తన కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరుకు ఎవరైనా ఫిదా అవ్వవలసిందేనట. సుమ, మరియు రాజీవ్ కనకాల దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఇక ఇటీవల ఆమె అత్తగారు సరస్వతి గారు కాలం చేశారు.

ఇక మామగారైన దేవదాస్ కనకాల గారు కూడా వారి ఇంట్లోనే వుంటారు. సుమ మొదటినుండి తమ అత్త మామలను కన్నకూతురిలా చూసుకునేవారట. అంతేకాదు, ఎంత హోదా, డబ్బు ఉన్నపటికీ కూడా ఆమె ఇంట్లోని పనులన్నీ స్వయంగా తానే చేసుచేసుకుంటారట. ఇక రోజు పొద్దున్నే నిద్ర లేచింది మొదలు, తిరిగి పడుకునే వరకు ఇంటి పనులు, తన షూటింగ్ లు, ఇంట్లోవారి భోజన సదుపాయాలు, ఇక ఇంట్లోకి ఏమి కావాలో చూసుకోవడంవంటివి కూడా దగ్గరుండి చూసుకుంటారట. ఇకపోతే ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే వారిని సుమ ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారని, నిజానికి సుమ అన్ని విధాలా సహకారం అందించడం వల్లనే భర్త రాజీవ్ ఎప్పుడూ అంత సంతోషంగా ఉంటారని తెలుస్తోంది. తన జీవితంలో సుమ తనకు భార్యగా దొరకడం నిజంగా తన అదృష్టమని రాజీవ్ ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

రాజీవ్ కూడా తనకు మొదటినుండి ఎంతో సపోర్ట్ ఇవ్వడంతోనే తాను ఈ రోజున ఈ స్థాయిలో వున్నానని, ఇక తన తల్లి తండ్రులు మరియు అత్తమామలు తన ఎదుగుదలకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిదని సుమ కూడా చెపుతుంటారు. నిజంగా బయట ఎన్నో కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్లను ఒక్కచేత్తో హ్యాండిల్ చేయగల సుమ గారు, ఎంతో ఒద్దికతో పద్దతిగా తన ఇంటిని చూసుకుంటారంటే నిజంగా ఎవరికైన ఆశ్చర్యం వేయకమానదు