ఈ సెలెబ్రిటీల కూతుళ్లను ఒక్కసారి చూస్తే చాలు ఇంక కళ్ళు తిప్పుకోలేరు!

0
312
ప్రస్తుతం అటు టాలీవుడ్ లో ఇటు బుల్లితెరపై మంచి పేరు మరియు ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించిన నటీమణుల పర్సనల్ లైఫ్ గురించి మనలో చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇకపోతే అటువంటివారిలో బుల్లితెరపై మంచి  ఫేమస్ అయి అటు యాంకర్ గాను, ఇటు పలు షో లకు జడ్జిగాను వ్యవహరిస్తున్న సుమ గారి గురించి అందరికంటే ముందుగా చెప్పుకోవాలి. సుమ, రాజీవ్ దంపతులకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇక సుమ కూతురు మనస్విని గురించి ఇప్పటివరకు వారిద్దరూ పెద్దగా ఎటువంటి ఇంటర్వ్యూ లోను చెప్పకపోవడంతో చాలామందికి ఆ అమ్మాయి  ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఉంటుంది.  అయితే మనస్విని ప్రస్తుతం చదువుపైనే ఎక్కువ దృష్టిపెట్టిందని, నిజానికి ఆ అమ్మాయికి సినిమాలపై పెద్ద గా ఆసక్తి లేదనేది టాక్. ఇకపోతే మరొక యాంకర్ ఝాన్సీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఝాన్సీ చాలా ఏళ్ళ క్రితం జెమినీటీవీలో మంచి పేరు సంపాదించిన జోగి బ్రదర్స్ షోలో యాంకర్లలో ఒకరైన కృష్ణంరాజును వివాహం చేసుకున్నారు.
అయితే కొన్ని మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు, కాగా వారికి ఒక కూతురు కూడా వుంది. ఆ అమ్మాయి పేరు ధన్య. ధన్య గురించి ఎప్పుడు అడిగినప్పటికీ, తాను ప్రస్తుతం చిన్న అమ్మాయి కనుక, ఇప్పుడే తన కెరీర్  గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పినట్లు సమాచారం. ఇక సినిమాల్లో తన వైవిధ్యమైన నటనతో మంచి పేరుసంపాదించిన సురేఖవాణి కూడా మనందరికీ సుపరిచితమే. ఆమె కూతరు పేరు సుప్రీత, అయితే సుప్రీతను మాత్రం సినిమాల్లోకి తీసుకురావాలని తల్లి ఆలోచనట, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుప్రీత గురించి మాట్లాడిన సురేఖ, తనకు మోడలింగ్ అంటే చాలాఇష్టమని, రానున్న రోజుల్లో కూతురిని మంచి నటిని చేయాలనేది తన ఆలోచన అని చెప్తోంది. ఇక సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత కూతరు శ్రేయ ఇటీవల సవ్యసాచి సినిమాలో ఒక పాట పాడడం ద్వారా టాలీవుడ్ కి పరిచయమయింది. తన కూత్రురును తనవలె మంచి సింగర్ గా చేయాలనీ ఉందని సునీత ఎపుడు చెపుతుంటారు.
ఇక రాబోయే రోజుల్లో తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఇకపోతే తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించిన నటీమణుల్లో హేమ కూడా ఒకరు. హేమకు కూడా ఒక కూతరు. అయితే ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చేందుకు తమకు అంతగా ఇష్టం లేదని, కానీ రానున్న రోజుల్లో తన ఇష్టాన్ని బట్టి అవకాశం ఉంటే హీరోయిన్ ని చేస్తాను అని హేమ అంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మనకు ఎంతో సుపరిచితమే మంచి పేరుసంపాదించిన ఈ నటీమణుల కూతుళ్ళని, మరి వారి వారి తల్లుల ఆశ ప్రకారం ఆ పిల్లలు ఎంతవరకు వృద్ధిలోకి వస్తారో రాబోయే రోజుల్లో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here