ఉదయ్ కిరణ్ భార్య ప్రస్తుతం ఏమి చేస్తుందో, ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా!

0
123
చిత్రం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్, ఆ తరువాత నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సమయంలో తన పెద్ద కుమార్తెకు ఉదయ్ కిరణ్ ఇచ్చి వివాహం చేయాలనీ అనుకుంటున్నట్లుగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఏమి జరిగిందో తెలియదుగాని ఉదయ్ కి మెగా అల్లుడు అయ్యే భాగ్యం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఇక ఆ తరువాత ఉదయ్ తన కెరీర్ ని బిల్డప్ చేసుకునే పనిలో పడ్డాడు. అయితే ఊహించని విధంగా అతడి కెరీర్ అక్కడినుండి బాగా దెబ్బతినడం మొదలయింది. ఇంతకముందుతో పోలిస్తే ఉదయ్ కి రాను రాను అవకాశాలు రావడం తగ్గడం, ఇక చేసిన సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవుతూ వస్తుండడంతో ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా వున్న ఉదయ్, ఆ సమయంలో విషిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ఇక వివాహం తరువాత అయినా తన రాత మారుతుందని ఆశించిన ఉదయ్ కి ఏ మాత్రం మారకపోవడంతో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడితో తన స్వగృహంలో 2014లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వాస్తవానికి వారి దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు లేవని, అయితే ఉదయ్ ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించేవాడని తన భార్య విషిత చెపుతోంది. అప్పుడపుడు కొందరు నిర్మాతలను ఉదయ్ వెళ్లి కలిసి వస్తుండేవాడని, కానీ తన మార్కెట్ స్థాయి పూర్తిగా పడిపోవడంతో వారు ముందుకురావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఉదయ్ ఎంతో బాధపడేవాడని తన భార్య చెపుతోంది. ఇక ఉదయ్ మరణం తరువాత విషిత ఇటీవల రెండవ వివాహం చేసుకుందని, నిజానికి ఉదయ్ తల్లితండ్రులు కూడా తనని రెండవ పెళ్లి చేసుకోమని ఒప్పించడంతోనే తాను కూడా చేసుకున్నానని చెపుతోందట విషిత. అయితే ఉదయ్ ఎప్పుడు తన గుండెల్లోనే ఉంటాడని, ప్రస్తుతం తనను చేసుకున్న వ్యక్తి ఒక డాక్టర్ అని, ఆయనకు తన గత జీవితం మొత్తం తెలుసునని, అన్ని ఆయనకు వివరించిన తరువాతనే ఇద్దరం వివాహం చేసుకున్నామని విషిత చెపుతోంది