ఎన్టీఆర్ నాకు అన్నకానే కాదు, నందమూరి మోక్షజ్ఞ ఆశ్చర్యకర వ్యాఖ్యలు!

0
312
ఇప్పటికే టాలీవుడ్ లో అటు మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ తన వరుస సినిమాలతో అదరగొడుతూ దూసుకుపోతుంటే, మరోవైపు యువసామ్రాట్ నాగార్జున నట వారసులు చైతన్య, అఖిల్ లు కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎప్పటినుండో తన కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడు అని చెప్తున్న బాలకృష్ణ, ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి అతడిని టాలీవుడ్ రంగప్రవేశం చేయించనున్నట్లు సమాచారం. నిజానికి మోక్షజ్ఞను ఈ ఏడు జనవరిలోనే సినిమాల్లోకి తీసుకుని రావాలి అనుకున్నారని, అయితే కొన్ని అనుకోని కారణాల వలన అది వాయిదా పడి వచ్చే సంక్రాంతికి ముహూర్తం కుదిరింది అనేది ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోగా నటిస్తున్న బాలకృష్ణ, ఆ సినిమా తరువాత రాబోయే ఎలక్షన్లపై దృష్టిపెట్టి అక్కడినుండి రాజకీయాల్లో బిజీ అయ్యి, అడపాదడపా మాత్రమే సినిమాలు చేయాలనీ నిర్ణయించారట.
ఇక మోక్షజ్ఞ ఎంట్రీతో తమ మూడవతరాన్ని చూడబోతున్నారు నందమూరి అభిమానులు. ఇక మోక్షజ్ఞ కూడా ఇప్పటికే హీరోగా అన్నివిధాలా రెడీ అయ్యాడడని అంటున్నారు. ఇకపోతే మోక్షజ్ఞ ఇటీవల తన సన్నిహితుల దగ్గర చెప్పిన కొన్ని మాటలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారాయి. మొదటి నుండి తాతయ్య మరియు తండ్రి బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగిన మోక్షజ్ఞ కు అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణమట. అంతే కాదు తనకు వీలు కుదిరినప్పుడల్లా ఎన్టీఆర్ సినిమాలు చూసే మోక్షజ్ఞ, ఎపుడు అన్నను కలిసినా సినిమాల విషయంలో అనేక సలహాలు పొందుతుంటాడట. ఎటువంటి సినిమాలు చేయాలి, ఎటువంటి కథలు ఎంచుకోవాలి, అభిమానులతో ఎలా మెలగాలి వంటి సూచనలు ఎన్టీఆర్ ఇచ్చేవాడట. నిజానికి అయన తనకు అన్నయ్య కాదని, తండ్రి తరువాత తండ్రి అంతటివాడని తన సన్నిహితులతో చెపుతుండేవాడట.
అంతేకాదు తాను నటనలో శిక్షణ ఎవరి దగ్గర తీసుకోవాలి, డాన్స్, ఫైట్స్ వంటివాటిలో ఏ విధంగా శిక్షణ తీసుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందో కూడా ఎన్టీఆర్ చెప్పేవాడని, అందుకే తన సినిమా ప్రారంభోత్సవానికి అన్న ఎన్టీఆర్ ను ప్రత్యేక అతిథిగా పిలవాలని మోక్షజ్ఞ అనుకుంటున్నట్లు వినికిడి. ఇక మోక్షజ్ఞ., తన అన్న ఎన్టీఆర్ పై ఈ విధంగా ప్రేమ కురిపించడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో మోక్షజ్ఞపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here