ఒకప్పటి చిరంజీవి మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

0
319
సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోలుగా, హీరోయిన్లుగా అలానే ఇతరత్రా పాత్రల్లో నటించి మెప్పించినవారు ఎందరో ఉన్నారు. ఇక తెలుగు సినిమాల్లో అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి యావత్ భారత దేశం గర్వించదగ్గ నటిగా గుర్తింపు పొందిన దివంగత శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే. ఇక తెలుగులో చైల్డ్  ఆర్టిస్టులుగా నటించి, తరువాత మంచి పాత్రల్లో నటించిన రోజారమణి, తరుణ్, తనీష్., రాశి, సుజిత, ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు వంటి అద్భుత నటులు ఎందరో వున్నారు.  అయితే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి 2005లో జై చిరంజీవ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియ శర్మ ఇపుడు ఎలా ఉందొ తెలిస్తే షాక్అవుతారు. జైచిరంజీవిలో ఆమె చిరంజీవికి మేనకోడలుగా నటించి మెప్పించింది. స్వతహాగా హిమాచల్ ప్రదేశ్ కి చెందిన శ్రియకు చిన్నప్పటినుండి చూడచక్కని రూపాన్ని కలిగి ఉండడంతో ఆమె స్కూల్ లోని వారందరూ తనని బేబీ డాల్ అని పిలిచేవారట. అలా ఒకరోజు అనుకోకుండా ఆమెని చూసిన ఒక హిందీ సినీ నిర్మాత చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ సినిమాలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇక అక్కడినుండి చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె దాదాపుగా 16 సినిమాల్లో నటించారు. ఆ తరువాత నటనకు కొంత విరామం ప్రకటించి, తన స్కూలింగ్ ని కంటిన్యూ చేసిన శ్రియ, ఆ తరువాత 2016లో తెలుగులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కానప్పటికీ శ్రియకి మాత్రం ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయట. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన అనుభవం ఉండడంతో ఆమెకు ఆ భాషల్లో మంచి ప్రావిణ్యం ఉందట. అంతేకాదు శ్రియ చదువులోనూ మంచి దిట్ట అని, మొదటినుండి ఆమెకు క్లాస్ లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేవని అంటున్నారు ఆమె తల్లితండ్రులు. కాగా ప్రస్తుతం ఒక తమిళ మరియు ఒక మలయాళ సినిమా శ్రియ చేతిలో ఉన్నాయని, అవి కనుక మంచి విజయవంతం అయితే, శ్రియకు సినీ భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here