ఒకప్పటి డాన్సర్ జయమాలిని పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు!

0
293
ఒకప్పుడు  ఎన్టీఆర్,ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో ఏదైనా వాంప్ సాంగ్ ఉందంటే అందరికి ముందుగా గుర్తుకువచ్చే పేరు జయమాలిని. అయితే ఆతరువాత ఆమె స్పూర్తితో అటువంటి పాటలు మరియు ప్రత్యేక గీతాలలో అనురాధ వంటి నటీమణులు నటించినప్పటికీ ఎవ్వరికీ జయమాలినికి వచ్చినంత పేరు రాలేదని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే, ప్రస్తుతం ఎంత ముమైత్ ఖాన్ వంటి వారు వస్తున్నప్పటికీ, అప్పటి జయమాలినిని మాత్రం మనవాళ్ళు ఇంకా మర్చిపోలేదని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు అప్పట్లో తమిళ, హిందీ ప్రత్యేక గీతాల్లో కూడా ఆమె నటించి అందరిని మెప్పించారు. అయితే జయమాలిని మాత్రమే కాదు ఆమె అక్క జ్యోతి లక్ష్మి కూడా అప్పట్లో అటువంటి పాటల్లో నర్తించి మంచి పేరు సంపాదించారు. ఇక కొన్ని పాటల్లో అయితే, అక్కచెల్లెళ్ళిద్దరూ కలిసి నటించిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల కొన్నాళ్లక్రితం జ్యోతి లక్ష్మి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనుకోకుండా కొద్దిరోజుల క్రితం ఆమె చెన్నైలోని ఒక ఆసుపత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిజానికి జయమాలిని, జ్యోతిలక్ష్మి ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా కలిసి చేసేవారట.
కానీ అక్క హఠాత్తుగా చనిపోవడంతో కొంత మనోవేదనకు గురైన జయమాలిని అప్పటినుండి ఎంతో ముభావంగా వుంటున్నారని అంటున్నారు. ఇక అన్నిటికంటే  ముఖ్యమైన విషయం ఏమిటంటే, జ్యోతి లక్ష్మి బ్రతికి వున్నపుడు అక్కచెల్లెళ్ళిద్దరూ కూడా విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవారట. అయితే అక్క మరణం తరువాత వారు చేసిన అప్పులు తాలూకు సమస్యలు ఎక్కువయ్యాయని, అంతేకాక అప్పుల వాళ్ళు తమ డబ్బు తమకు ఇచ్చేయమని ఒత్తిడి చేయడంతో ఇటీవల జయమాలిని, వున్న ఆస్తినంతా అమ్మి పూర్తిగా రోడ్డునపడినట్లు సమాచారం. నిజానికి ఇదివరకు వారు సాయం అందించిన బంధువుల్లో ఒక్కరు కూడా జయమాలిని పరిస్థితి చూసి సాయం చేయడానికి ముందుకు కూడా రావడం లేదని, ప్రస్తుతం ఆమె దీన స్థితిలో వున్నారని అంటున్నారు. ఇక ఆమెకు ఒకరకముగా భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని, అందువల్ల సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆమెకు కొంత ఆర్ధిక సాయం అందిస్తే బాగుంటుందని ఈ వార్త తెలిసిన పలువురు సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తి చేస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here