కాజల్ నే కాదు, మెహ్రీన్ ని కూడా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసిన చోటా!

0
260
సినీఇండస్ట్రీలో జరిగే ఎటువంటి చిన్న విషయమైనా ప్రస్తుతం ఒక పెద్ద ఇష్యూ గా మారిపోతున్న రోజులివి. ఇక ఇక్కడ కొందరు ప్రవర్తించే పద్ధతిని చూస్తే అలా కావాలనే ప్రవర్తిస్తున్నారా లేక, అనుకోకుండా సందర్భానుసారం అలా చేయవలసి వచ్చిందో అర్ధం కాదు. ఇక మ్యాటర్ లోకి వెళితే, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్ మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కవచం. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో నటీనటులు మరియు సినిమాకి పనిచేసిన వారు మాట్లాడారు.  అందులో హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ, ఈ సినిమలో పనిచేయడం నిజంగా ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని, సాయి తో వర్క్ ఎక్స్పీరియన్స్ వండర్ ఫుల్ గా ఉందని, ఇక దర్శకుడు మరియు నిర్మాతలు సినిమా ఎలాగైనా హిట్ చేయాలని విపరీతంగా శ్రమించారని అన్నారు. ఇక మాటల సందర్భంలో ఈ సినిమాకి పనిచేసిన కెమెరామాన్ చోట కె నాయుడు గురించి మాట్లాడుతూ, తనకు ఇష్టమైన కెమెరామాన్ లలో చోట గారు ముందు వరుసలో ఉంటారని అనగానే, అయన కాజల్ దగ్గరకు వచ్చి ఆమెని ముద్దు పెట్టుకున్నాడు.
ఈ ఘటన చూసిన అక్కడివారందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. నిజానికి కాజల్ కి చోట కి వయోబేధం ఎంతో ఉంటుంది, ఎంత తనకు ఇష్టమైన హీరోయిన్ అయినా అలా అందరిలో ఆమెను ముద్దు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని, ఆయనను కొందరు నెటిజన్లు తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే చోట కేవలం కాజల్ నే కాదు, స్టేజి పై వున్న మెహ్రీన్ ని కూడా ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేసారని సమాచారం. అయితే చోట ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో మెహ్రీన్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడని, ఆ సమయంలో అతడిని గమనించిన మెహ్రీన్, కాస్త దూరంగా జరిగి నిలబడిందని అంటున్నారు. ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించి మంచి పేరు తెచ్చుకున్న చోటా, ఈ విధంగా చీప్ గా వ్యవహరించి నిజంగా తన స్థాయిని దిగజార్చుకున్నాడని కొందరు అంటున్నారు. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here