కోవై సరళ ఆరోగ్యపరిస్థితి విషమం… పట్టించుకోని బంధువులు!

0
280
సినీ పరిశ్రమలో ఎందరో నటీ నటులు తాము మంచి స్థాయిలో వున్నపుడు డబ్బు బాగా సంపాదించి, తమ కుటుంబసభ్యుల ఎదుగుదలకు తోడ్పడిన వారు ఎందరో వున్నారు. అయితే అందులో కొంతమంది తమ జీవితం చరమాంకంలో మాత్రం కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వైద్యానికి కావలసిన డబ్బు, తమకు ఆ సమయంలో తోడ్పాటు అందించేవారు కూడా లేకుండా చితికిపోయి ప్రాణాలు వదిలిన ఘటనలు కూడా కొన్ని వున్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రముఖ లేడీ కామెడీ ఆర్టిస్ట్ కోవై సరళ గురించి. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో తన అద్భుత హాస్య నటనతో ప్రేక్షకుల మనసుదోచిన కోవై సరళ జీవితం మొదట్లో ఎంతో కష్టాల ఊబిలో ఉండేదని, ఇక కోవై సరళకు నలుగురు అక్కలు అని, ఆమె ఆర్టిస్ట్ గా పైకి ఎదుగుతున్న సమయంలో ఎప్పటికపుడు తనవంతుగా వారికుటుంబాలను ఆదుకునేదట. అంతే కాదు తనకు వచ్చిన డబ్బులో చాలావరకు వారి వారి కుటుంబాలకే ఖర్చు చేసేవారని సమాచారం.
అయితే ఇటీవల ఒక మనవడు తన ఆస్తిలో వట కావాలంటూ ఆమెపై కోర్టులో దావా వేసాడని, అయితే నిజానికి తన పేరుమీద ప్రత్యేకంగా ఆస్థి ఏది లేదని, అంతా మీ అందరికే ఖర్చుచేసాను అంటూ కోర్ట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారట. ఆ ఘటనతో కొంత మానసిక వేదనకు గురైన సరళ గారు, అనంతరం షుగర్ మరియు బిపి లెవెల్స్ పెరిగి, మొహం కాస్త ఉబ్బిపోయి ఇటీవల తమిళనాడులోని ఒక హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కోసం చేరారట. అయితే ఆ సమయంలో ఆమెను కనీసం పరామర్శించడానికి కూడా తమ ఇంట్లోని వారెవరూ రాకపోవడం, మరియు ఆ సమయంలో తన చికిత్సకు కావలసిన డబ్బు కూడా లేకపోవడంతో ఆమె ఉద్వేగానికి లోనై బాధపడ్డారట. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త పర్వాలేదని డాక్టలు చెప్పారట. ఏ మనిషికైనా చివరి దశలో వున్నపుడు తమ వారు అనుకునేవారు పక్కనే ఉంటే, అంతకంటే ఆనందం మరొకటి ఉండదని, కావున ఆమె కుటుంబ సభ్యులు తవరలో ఆమెను ఆదుకోవాలని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న సరళ గారు అతి త్వరలోనే కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు….