కౌశల్ చేసిన ఈ ఒక్కపని తెలిస్తే కౌశల్ పై అభిమానం మరింత పెరుగక మానదు!

0
319
ఇటీవల స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ షో లో విపరీతమైన వోటింగ్స్ మరియు ప్రజాభిమానం పొంది, చివరికి విజేతగా నిలిచాడు కౌశల్. ఆయను ఎలాగైనా గెలిపించాలని ఆయన అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతో పలురకాల సేవ కార్యక్రమాలు నిర్వహించి, ఊరు ఊర, వాడ వాడ కౌశల్ కు ఓట్లు వేయమంటూ ప్రచారాలు చేసారు. ఇక ప్రేక్షకులు కూడా చాలావరకు కౌశల్ కే ఓట్లు వేసి మద్దతు పలకడంతో అనూహ్యమైన వోటింగ్ తో కౌశల్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఆ షోలో మనం చూడని కొంత భాగాన్ని బిగ్ బాస్ టీమ్, అన్ సీన్ పేరుతో ప్రసారం చేస్తుంది అనే విషయం మనకు తెలుసు. ఇటీవల స్టార్ మా, తమ ఛానల్ తరపున ఒక అనాధ ఆశ్రమంలోని బాలికలకు కొంత ఆర్ధిక సాయం చేస్తూవస్తోంది.
ఇటీవల ప్రసారమైన ఒక బిగ్ బాస్ అన్ సీన్ ప్రోగ్రామ్ లో ఆ  అనాధాశ్రమాన్ని అక్కడి బాలికలను గురించి చూపించిన స్టార్ మా సంస్థవారు, ఆ విషయమై కౌశల్ కు సంబంధం వున్న ఒక విషయాన్నీ మాత్రం దాచి ఉంచారట. ఇక మ్యాటర్ ఏంటంటే, కౌశల్ ఆ ఆశ్రమంలోని అనాధ బాలికల్లో ఒక ఇద్దరికి తన తరపున రూ.10,000 చొప్పున ప్రతి సంవత్సరం ఆర్ధిక సాయం చేస్తానని వాగ్దానం చేసాడట. ఇక ఈ విషయాన్నీ నిన్నటి ఇంటర్వ్యూ లో వెల్లడించిన కౌశల్, దానిని మాత్రం ప్రసారం చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ ఆ చెప్పిన ఆ విషయాన్ని విన్న పలువురు అతడి మంచితనికి హాట్స్ ఆఫ్ అంటూ సోషల్ మీడియాలో పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇకపోతే కౌశల్ ఆర్మీ, తాము కౌశల్ ఫాన్స్ అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడుతున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ తాజా ఘటనతో కౌశల్ ఇమేజ్ మరింత పెరిగిందని అర్ధమవుతోంది….ఏమంటారు మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here