బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ షో ముగిసినప్పటికీ కూడా, ఇప్పటికీ ప్రేక్షకులు షోలో పాల్గొన్న హౌస్ మేట్స్ పై తమ ఎనలేని అభిమానాన్ని చాటుకుంటున్నా
రు. ఇక విషయంలోకి వెళితే, నిజానికి షోలో వున్న వ్యక్తుల్లో కౌషల్ కు చాలావరకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. అయితే తాను షోలో వున్నంతవరకు కౌషల్ గెలవాలని, ఎలిమినేట్ అయ్యేవరకూ అతనికి మద్దతుగా నిలిచింది మాత్రం నూతన నాయుడు అనే చెప్పుకోవాలి. ఇక ఆ తరువాత షో పూర్తి అవ్వడం, కౌషల్ ఫైనల్ విన్నర్ గా నిలవడం జరిగిపోయాయి. అయితే మిగతావారు తనకు ఫోన్ చేయలేదు, తనని అసలు పట్టించుకోలేదు అని చెపుతున్న కౌషల్, షోలో ఆయనకు మద్దతిచ్చిన తనను టైటిల్ గెలిచి బయటకువచ్చాక ఏమి పట్టించుకున్నాడు అంటూ నూతన నాయుడు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

