ఖడ్గం హీరోయిన్ సంగీత కు ఒక స్టార్ హీరోతో వున్న సంబంధం గురించి తెలిస్తే షాక్ అవుతారు!

0
312

సినిమాల్లో నటించే హీరోయిన్ ల పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు మనలో చాలా మందికి తెలియవు. అందులో కొందరు సినీ నేపథ్యంతో ప్రవేశించిన వారయితే మరికొందరేమో సినిమా వారితో ఎటువంటి పరిచయం లేనప్పటికీ అనుకోకుండా సినిమాల్లోకి ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు పద్ధతుల్లో మొదటి పద్దతికి చెందింది ఖడ్గం సినిమాతో హీరోయిన్ గా తెలుగులో మంచి పేరు సంపాదించిన సంగీత. నిజానికి ఆమె తాతయ్య కేఆర్ బాలన్ అప్పట్లో మంచి పేరున్న సంగీత దర్శకులు. ఇక ఆమె తల్లితండ్రులకు కూడా సినీ ఇండస్ట్రీ తో కొంత అనుబంధం ఉందనే చెప్పాలి. ఆమె తండ్రి శాంతారాం ఒకప్పటి పెద్ద సినీ నిర్మాతల్లో ఒకరు. అయితే చిన్నప్పటినుండి భారత నాట్యకళ పట్ల మంచి ఆసక్తి కనపరిచిన సంగీత, అందులో మంచి ప్రావిణ్యం సంపాదించింది. నిజానికి ఆమె 1997లోనే గంగోత్రి అనే మలయాళ సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు తమిళ్ లో అవకాశాలు బాగా పెరిగాయి. 

ఇక తెలుగులో ఆమె ఖడ్గం సినిమా కంటే ముందు ఆశల సందడి, నవ్వుతూ బతకలిరా అనే సినిమాల్లో నటించింది. అయితే ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పే డైలాగ్ ఇప్పటికీ మన తెలుగు వారు మర్చిపోలేరంటే, ఆమె పాత్ర ఎంత గుర్తింపునిచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే తెలుగులో ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషీగా, సంక్రాంతి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఆ తరువాత గాయకుడు క్రిష్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె జీవితంలో కోలీవడ్ కి చెందిన ఒక హీరోతో మంచి అనుబంధం ఉందనేది చాలామందికి తెలియని విషయం. మ్యాటర్ ఏమిటంటే, తమిళ హీరో విజయ్ కు, సంగీత ఫ్యామిలీ తో మంచి పరిచయం ఉందని, నిజానికి సంగీత సినిమాల్లోకి వచ్చేటపుడు ఆమె పేరు రసిక, అయితే ఆ పేరు బాలేదని పేరు మార్చుకోమన్నది విజయ్ అట.
అంతేకాదు అన్నీ కలిసివచ్చి ఉంటే, అప్పట్లో సంగీత విజయ్ ప్రక్కనే హీరోయిన్ గా పరిచయమయ్యేవారట సంగీత. కానీ అది కుదరలేదని, భరతనాట్య కళలో పట్టున్న సంగీత చేసిన పలు డాన్స్ ప్రోగ్రామ్స్ చూసిన విజయ కి ఆమె అంటే విపరీతమైన అభిమానమాట. ఆ సమయంలో అనుకోకుండా ఆమె సింగర్ క్రిష్ ని కలవడం, అతనితో ప్రేమలో పడడం జరిగిపోయాయని, అంతేకాదు మొదట క్రిష్ ని విజయ్ దగ్గరకు తీసుకువెళ్లి ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నీ అభిప్రాయం ఏంటి అని కూడా అడిగిందట సంగీత. అతనికి సంబంధించి విషయాలు విచారించి మరీ చివరికి క్రిష్ తో తన పెళ్లి విజయ్ దగ్గరుండి మరీ జరిపించారట. ఇక ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, సంగీత భర్త క్రిష్ అసలు పేరు విజయ్, అలానే విజయ్ భార్య పేరు సంగీత. ఒకరకంగా ఇది కాకతాళీయమే అయినప్పటికీ, వింటే మాత్రం ఒకింత ఆశ్చర్యం వేస్తుంది కదూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here