గాయపడ్డ పవన్ డ్రైవర్ చెప్పిన షాకింగ్ నిజాలు…. వింటే ఆశ్చర్యపోతారు!

0
254
ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయనవద్దకు సెల్ఫీ పేరుతో వచ్చి కత్తితో దాడిచేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన సంచలనాన్ని రేపిన విషయాన్ని మరిచిపోకముందే, నిన్న రాత్రని తన ప్రజా పోరాట యాత్ర ముగించుకుని వస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పైకి ఒక లారీ దూసుకువచ్చి పెను ప్రమాదాన్నే సృష్టించింది. యాత్ర ముగించుకున్న అనంతరం రాజమండ్రి నుండి కాకినాడ బయల్దేరిన పవన్ కాన్వాయ్, రాజంపేట వద్దకు చేరగానే హఠాత్తుగా అటుగా వస్తున్న ఒక లారీ అయన కాన్వాయిని బలంగా ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో పవన్ వాహనానికి ఏమి కాలేదు, అయన వెనుక వస్తున్న సెక్యూరిటీ వారి వాహనాన్ని ఆ లారీ బలంగా ఢీ కొట్టడంతో అందులోని ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, ఒక ఏడుగురు జన సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి గాయాలకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనపై కొందరు అనుకోకుండా జరిగిందని కొట్టిపారేస్తుంటే, మరొకొందరు మాత్రం ఇది ఖచ్చితంగా టిడిపి నాయకుల కుట్రలో భాగమే అని అంటున్నారు.
ఇక ఆ ప్రమాదం జరిగిన కారు డ్రైవర్ చెపుతున్న వివరాలను వింటే కొంత షాక్ అవ్వాల్సిందే. అదేమిటంటే నిజానికి తాము యాత్ర పూర్తి చేసుకుని మెల్లగా రాజమండ్రి నుండి బయలుదేరామని, అయితే ప్రశాంతంగా ప్రారంభమైన వారి ప్రయాణం రాజంపేటకు చేరుకోగానే ఒక్కసారిగా అటుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో గందరగోళంగా మారిందని. అయితే నిజానికి తాము రైట్ రూట్ లో వెళ్తున్నప్పటికీ, రాంగ్ రూట్ లో కావాలనే  లారీ మాపైకి దూసుకువచ్చిందనేది అతని వాదన. ఇక దీన్నిబట్టి చూస్తుంటే కాన్వాయ్ అటువైపుగా వస్తున్న విషయం ఖచ్చితంగా లారీ డ్రైవర్ కు కొంత దూరం నుండే అర్ధం అవుతుందని, మరి అటువంటపుడు అతను తన దారిలో వెళ్తూ సడన్ గా ఇటువైపుకు ఎందుకు తిప్పవలసి వచ్చిందో అర్ధం కావడం లేదని చెప్పాడు. అయితే యాక్సిడెంట్ అనంతరం లారీ డ్రైవర్ కూడా మిస్ అవడం ఆ అనుమానాలకు కొంత తావు ఇస్తోందని అన్నాడు. మరి ఆ కారు డ్రైవర్ చెపుతున్నట్లు నిజంగా ఇది ఒకరకముగా కుట్ర ప్రకారం జరిగిన దాడేనా లేక అనుకోకుండా జరిగిందా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్దిరోజలు ఓపికపట్టవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here