చిన్న కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్…వాళ్ళని అలా చూస్తూ షాకైన లక్ష్మి ప్రణతి!

0
240
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఇక అయన మన కీర్తి కిరీటాన్ని ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారో కూడా మనకు తెలుసు.  అయన నట వారసులుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, కళ్యాణ్ రామ్ వంటి వారు ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల హరికృష్ణ ఘోర కారు ప్రమాదంలో మరణించిన తరువాత అయన కుటుంబం చాలావరకు విషాదంలో మునిగిపోయింది. అయితే తండ్రిని అమితంగా ప్రేమించే ఎన్టీఆర్, తన ఇటీవల ప్రారంభమైన RRR మూవీ ఓపెనింగ్ సమయంలో తన తండ్రి ఉంటే బాగుండేదని తన సన్నిహితుల వద్ద ఎంతో ఆవేదన చెండాడట. ఇక తన చిన్నకొడుకు పుట్టిన తరువాతనే హరికృష్ణ మరణించడంతో, ఆయనకు చిన్న కొడుకుని చూసినప్పుడల్లా తండ్రే గుర్తుకు వస్తున్నారని, ఆ ఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ చాలా బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఇక అయన ఆ విధంగా బాధపడుతున్న పరిస్థితిని తరచు చూస్తున్న భార్య లక్ష్మి ప్రణతి కొంత ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. నిన్న మొన్నటివరకు తమ పిల్లలు, మరియు అత్తమామలతో ఇల్లంతా ఎంతో కళకళ లాడేదని, అయితే అలా హఠాత్తుగా తన మామగారు హరికృష్ణ మరణం తరువాత ఇంట్లో పూర్తిగా ఆనందం అనేదే లేకుండా పోయిందని బాధ పడుతోందట. ఎన్టీఆర్ మిత్రలు, మరియు సోదరి కూడా అయన పరిస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నారని, అంతేకాక, ఇకనైనా తండ్రి ఆలోచనల నుండి బయటపడి, కాస్త ప్రశాంతంగా ఉండి, తన లైఫ్ ని కొనసాగించాలని సూచించారట. ఎంతైనా కన్న తండ్రి వున్నట్లుండి అకాలమరణం చెందితే, ఎంతటి కొడుకులయినా ఒక్కసారిగా కృంగిపోతాడు అనడానికి ప్రస్తుతుం జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితిని చూస్తుంటే అర్ధం అవుతోందిఅని, పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనపై జాలిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here