చెట్టు నరుకుతున్న సమయంలో….. దానినుండి బయటకు వచ్చిన దానిని చూసి షాకయ్యాడు!

0
226
మనిషి మనుగడకు మూలం శ్వాస, అంటే మనం నిత్యం శ్వాసించే ఆక్సిజన్ ను మనం ఈ విశ్వం నుండి పీలుస్తున్నాం. అయితే భూమిపై ఆక్సిజన్ అందించడంలో కీలకపాత్ర పోషించేవి చెట్లు. మనం పీల్చే ఆక్సిజన్ ని అవి వదిలి మనం విడిచే కార్బన్ డయాక్సయిడ్ ని తీసుకుంటాయి. కాబట్టి మన జీవనానికి మూలాధారమైన చెట్లను నరకవద్దని పలు దేశ ప్రభుత్వాలు కూడా వివిధ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. కానీ చాలా చోట్ల మాత్రం చెట్లను, అడవులను నరికివేయడం ఆగడం లేదని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల అమెరికా లోని కొలంబియా ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ అనే వ్యక్తి వృత్తి రీత్యా ట్రీ కట్టర్. అయితే తన ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎన్నోఏళ్లుగా అడ్డంగా పెరిగి వున్న కొన్ని భారీ చెట్లను నరకడం మొదలెట్టాడు. కాగా ఒకరోజు కొన్ని చెట్లను నరికిన అతడు, ఒక చెట్టు దగ్గరకు వచ్చి, మిషన్ తో దానిని నరుకుతున్న సమయంలో అనూహ్యంగా అందులోనుండి బయటకు వచ్చిన ఒక జీవిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. అయితే నిజానికి అతడు చెట్టు నరుకుతున్న సమయంలో అది సగానికి తెగి కింద పడింది.
కానీ దాని మధ్యభాగంలో ఒక నల్లటి జీవి శరీరం సగానికి తెగి పడింది. అది చూసి షాకైన క్రిస్టోఫర్ అది ఏంటా అని పరీక్షించి చూడగా అది ఒక భయంకర నల్లత్రాచు. చెట్టు మద్యభంలో ఎన్నాళ్ళుగానో నివాసముంటున్న ఆ పాము, ఒక్కసారిగా చెట్టు ని సగానికి నరకడంతో దాని శరీరం కూడా రెండుగా ముక్కలై, అలానే చాలాసేపు గిలగిలలాడుతూ మరణించింది. ఇక ఈ విషాద దృశ్యాన్ని చూసిన క్రిస్టోఫర్ హృదయం ఒక్కసారిగా చలించిపోయింది. వెంటనే ఆ చనిపోయిన పాము రెండు శరీర భాగాలను బయటకు తీసి, దానిని అక్కడి ఒక ప్రదేశంలో పూడ్చిపెట్టాడు. అయితే ఆ క్షణంలోనే అతడు ఇకపై చెట్లు నరకకూడదని, మనలానే ఈ సృష్టిలోని జీవులు, చెట్లు పుట్టలు వంటి వాటిలో తమ గూడును ఏర్పాటుచేసుకుంటాయి. వాటిని మనం నరికి ఆ జీవులపాలిటి పాపం చేసిన వ్యక్తులుగా మిగులుతామని భావించాడు. కాబట్టి నేను ఇకపై ఇలా చెట్లు నరకరం వంటివి చేయను అని తనవారికి చెప్పడమేకాక, ఇకపై తన లాన్ లో చెట్లను, మొక్కలను కూడా నాటుతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు అతని నిర్ణయానికి మెచ్చి అతడిని అభినందిస్తున్నారు…..