ఛీ నీకు బుద్దుందా అంటూ చోట పై ఫైర్ అయిన పవన్…..!

0
102
సినిమా ఇండస్ట్రీ లో కొందరు చేసే వికృత చేష్టలు వారికి ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ, మిగతా వారికి మాత్రం కొంత జుగుప్సకరంగా ఉండడమే కాదు, మరికొందరికి అయితే అసహ్యంగా ఉంటాయి. నిన్న జరిగిన కవచం సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో కెమరామెన్ చోట కె నాయుడు, హీరోయిన్ కాజల్ ని ముద్దుపెట్టుకోవడంపై పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కాజల్ మాట్లాడుతూ, తనకు ఇష్టమైన కెమరామెన్ లలో చోట గారు ఒకరు, అయన సెట్లో ఉన్నంతసేపు ఎంతో సందడిగా ఉంటుందని, అయన అంతటి సరదా మనిషిని తాను ఇంతవరకు చూడలేదని కాజల్ అనడంతో, ఆమె దగ్గరకు వచ్చిన చోట, ఆమెను ముద్దుపెట్టుకుంటాడు. అది చూసిన స్టేజి పై వారందరికీ షాకింగ్ గా అనిపించింది. అయితే ఈ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారి పలు చర్చలకు దరి తీస్తోంది. కొందరు చోట ఆ విధంగా చేయడం తప్పని సున్నితంగా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అంతపెద్ద హోదాలో వున్న అయన ఇంత చీప్ గా బెహేవ్ చేయడం నిజంగా ఖండించ దగ్గ విషయమని,
ఇలా ఆడవారిపట్ల ఇంత నీచంగా ప్రవర్తించడం ఏమిటని ఆయన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇక ఈ విషయమై నేడు పవన్ కళ్యాణ్ కొంత ఫైర్ అయినట్లు చెపుతున్నారు. నిజానికి తనకు సినిమా ఇండస్ట్రీలో బాగా నచ్చిన వ్యక్తుల్లో చోట ఒకరని, నాతో మరియు అన్నయ్యతో ఆయనకు మంచి అనుబంధం ఉందని పవన్ అన్నారు. మరి అటువంటి వ్యక్తి ఇలా నిన్నటి ఫంక్షన్ లో కాజల్ ని ముద్దు పెట్టుకోవడం తనకు కొంత ఇబ్బందిగా అనిపించిందని అన్నారట. అంతేకాదు మన తెలుగు వారు ఆడవారికి ఎంత గౌరవం, ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. అటువంటి మనమే ఇలా వారిని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని, మరియు అంతపెద్ద ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తి, దాదాపుగా తన కూతురు స్థాయి అమ్మాయికి ముద్దు పెట్టడం ఏంటని కొంత ఆగ్రహించారట.
అంతటితో ఆగని పవన్, చోట కి కాల్ చేసి కొంత ఘాటుగానే మాట్లాడారని అయన సన్నిహితులు చెపుతున్నారు. నిజానికి పవన్ మొదటినుండి ఆడవారిపై జరిగే అఘాయిత్యాలను, ఇటువంటి ఘటనలను ఖండిస్తుంటారు. అందువల్లనే నిన్న ఈ విషయం చూసినప్పటినుండి కొంత ఆవేదన చెందిన పవన్, చోటపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేసారని అంటున్నారు. ఇక పవన్ చేసిన ఈ మంచి పనిపై పలువురు మెగాభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికల్లో అభినందనలు తెలియచేస్తున్నారు..