ఛీ నువ్వు నాకొడుకువే కాదు…కొడుకు చేసిన పనికి మండిపడ్డ ఎస్పీ బాలు!

0
123
తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించిన వారిలో అప్పట్లో ఘంటశాల గారి తరువాత మరొక గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు గారు అనే చెప్పుకోవాలి. అయితే బాలు గారు కేవలం తెలుగులోనే కాదు, అటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ మరియు కొన్ని ఇతర భాషల్లో కూడా పాటలు పాడారు. తన కెరీర్ లో మొత్తం దాదాపుగా 40,000 పై గా పాటలు పాడారంటే బాలు గారి గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక బాలు గారికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు. కుమార్తె పల్లవికి సినీ రంగంతో పరిచయం తక్కువ అయినప్పటికీ, కుమారుడు చరణ్ కు మాత్రం సినీ పరిశ్రమతో మంచి అనుబంధం వుంది. అయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ను మొదలుకొని కొందరు చిన్న నటులకు కూడా పాటలు పాడారు.
అంతే కాదు అయన మంచి నటుడు కూడా. సరోజ, నాలో వంటి తెలుగు సినిమాల్లో నటించిన అయన, కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు. అలానే అయన ఇటీవల ఒకటి, రెండు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. ఇక చరణ్ తన మిత్రులతో కలిసి ఒక ప్రొడక్షన్ బ్యానర్ ని నెలకొల్పి దానిపై చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయనకు సంబందించిన ఒక వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. చరణ్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లో తమిళ నటి సన ను కించపరిచేలా మాట్లాడారట. అయితే ఆ మాటలకు కొంత ఆవేదన చెందిన సన, ఆయనపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిందట. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, వెంటనే చరణ్ ని అదుపులోకి తీసుకున్నారట. అయితే విషయం తెలుసుకున్న బాలు గారు, తన పరపతిని ఉపయోగించి ఎలాగోలా చరణ్ ని బయటకు తీసుకువచ్చారట. బయటకు వచ్చాక కూడా చరణ్, తన స్నేహితులతో కలిసి ఆమెను మరింత అసహ్యంగా గేళి చేయడం, దూషించడం వంటివి చేయడం కొనసాగించాడట.
ఇక ఈ ఘటనతో కలత చెందిన సన మరొక్కసారి పోలీసులకు గట్టిగా ఫిర్యాదుచేసి చరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరిందట. ఇకపోతే ఇదివరకు మంచి అమ్మాయిని చూసి చరణ్ కు పెళ్లి చేస్తే, కొద్దిరోజుల్లోనే చరణ్ ఆ అమ్మాయిని హింసించి చివరికి విడాకులు తీసుకున్నాడని, ఇప్పుడేమో తోటి నటిని ఈ విధంగా కించపరుస్తున్నాడని తెలిసి బాలు గారు కొడుకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారని, అంతేకాదు అతన్ని తన ఇంటి నుండి బయటకు పంపేయాలని కూడా చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు, మంచి మనసున్న బాలు గారి కడుపున ఇటువంటి వ్యక్తి ఎలా పుట్టాడా అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది….