ఛీ మీకు సిగ్గుందా…. నిజానిజాలు తెలుసుకోకుండా ఏదిపడితే అది రాస్తారా….మీడియా పై ఫైర్ అయిన సుధీర్!

0
298
నేటికాలంలో టివి ఛానల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ తో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక మన టివి ఛానల్స్ కూడా పండుగలు సందర్భంగా రకరకాల సరికొత్త ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తూ వీక్షకులను మరింత ఆకట్టుకుని, రేటింగ్స్ పెంచుకుంటున్నాయి. ఇక మ్యాటర్ లోకి వెళితే, ఇటీవల దసరా సందర్భంగా సరైనోళ్లు అనే పేరుతో ప్రోగ్రాం ని ప్రసారం చేసి మంచి రేటింగ్స్ సంపాదించిన ఈటివి ఛానల్ వారు త్వరలో రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని తారాజువ్వలు అనే ప్రోగ్రాం ను ప్రసారం చేయబోతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ షో తాలూకు తొలి ప్రోమో వ్యూయర్స్ లో షోపై  బాగా ఆసక్తిని పెంచింది. ఇక మూడురోజుల క్రితం యూట్యూబ్ లో విడుదలైన మరొక ప్రోమో కూడా అదరగొట్టింది. ఇకపోతే ఆ ప్రోమోలోని ఒక ఘటనతో అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యంలో పడేశారు షో నిర్వాహకులు.
ఆ ప్రోమో చివరిలో విష్ణుప్రియ, సుధీర్ లు కలిసి గాల్లో తాళ్లు కట్టుకుని వేసే డాన్స్ అక్కడివారందరితో విపరీతంగా ఈలలు గోలలతో హోరెత్తించింది. అయితే సుధీర్ తాడుతో పైకి వెళ్లి డాన్స్ చేస్తున్న సమయంలో తలక్రిందులుగా వేలాడిన అతడు ఒక్కసారిగా స్పృహ తప్పడంతో, అతడిని మెల్లగా క్రిందకు దింపుతారు యూనిట్ సభ్యులు. ఎంత సేపు అతడి కాళ్ళు, చేతులు నిమిరినప్పటికీ అతడు స్పృహలోకి రాలేదని, అందుకే అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినట్లు పలు మీడియా ఛానల్స్ లో విపరీతంగా వార్తలు షికారు చేశాయి. అంతే కాదు ఆ సమయంలో షోలో అలీ,  సుమ,విష్ణు ప్రియా, రేష్మి లు ఎంతో ఆవేదన చెందినట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే  వాస్తవానికి ప్రోమోలో మనకు సగం వరకే చూపించారని, నిజానికి స్పృహ తప్పిన సుధీర్ కాసేపటి తరువాత మళ్లి మాములయ్యాడని, ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలన్నీ కూడా ఒట్టి కల్పితాలు అని సుధీర్ కొట్టిపారేస్తున్నారు.
అయినా ప్రోమోలోని ఒక చిన్న ఘటనను పట్టుకుని మీడియా ఛానల్స్ వారు ఎవరికి ఇష్టంవచ్చినట్లు వాళ్ళు ఎలా రాస్తారు అంటూ సుధీర్ మీడియా వారిపై విపరీతంగా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విధంగా తనపై తప్పదు రాతలు రాసి, తన ఇమేజిని ఇబ్బందుల్లోకి నెట్టడం భావ్యం కాదని, ఇకపై ఇటువంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దని మీడియా వారికి తన తరపున అభ్యర్ధిస్తున్నట్లు తెలిపాడు సుధీర్. మరి దీనితో అయినా సుధీర్ ఆరోగ్యం పై వస్తున్న పుకార్లకు అడ్డుకట్ట పడుతుందో లేదోచూడాలి ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here