జగన్ కు చంద్రబాబు ఫోన్….మ్యాటర్ తెలిస్తే ఛీ కొడతారు!

0
294
మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై శ్రీనివాస్ అనే ఆగంతకుడు హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్ భుజానికి గాయం అయింది. ఇక ఇప్పటికీ ఏ ఇద్దరు తెలుగు ప్రజలు మాట్లాడుకున్నా ఈ మ్యాటర్ గురించే చర్చిస్తున్నారు. ఇక ఈ హత్యాప్రయత్నంలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విశాఖ ఎయిర్ పోర్ట్ లోని క్యాంటీన్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. నిజానికి శ్రీనివాస్ పని చేస్తున్న ఆ క్యాంటీన్ ఒక టిడిపికి చెందిన నాయకుడిది అని తెలుస్తోంది. అయితే జగన్ ను చంపాలని కొందరు టీడీపీ నాయకులు కొన్నాళ్ల క్రితమే శ్రీనివాస్ అన్నయ్య మరియు బాబాయితో ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకుగాను దాదాపు కోటి రూపాయలవరకు సుపారీ కూడా తీసుకున్నారని వినికిడి. ఇక దానికి సంబంధించి శ్రీనివాస్ ని ముందుగా ఎయిర్ పోర్ట్ లోని తమ క్యాంటీన్ లో వైటర్ గా జాయిన్ చేసారని వైసిపి సహా కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. 
అయితే అవన్నీ ఒట్టి కల్పితాలని, వైసీపీ నేతలు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వారు అంటున్నారు. ఇక జగన్ కు గాయమైన దగ్గరినుండి పలువురు నేతలు ఆయనను పరామర్శిస్తున్నారు. ఆఖరికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ కు కాల్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటే, ఒక్క ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఆయనపై జరిగిన అఘాయిత్యం గురించి స్పందించకపోవడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడిపై ఈ విధంగా దాడి జరిగితే కనీసం ఖండించకుండా, ఇది ముమ్మాటికీ కావాలని వైసిపి కుట్రలో భాగమని, సానుభూతి ఓట్ల కోసమే జగన్ ఇలా తనపై తానే హత్యాయత్నం చేసుకున్నాడని చంద్రబాబు స్పందించిన విషయం తెలిసిందే. అయితే నిజానికి చంద్రబాబు ఇలా మాట్లాడడం వెనుక ఒక వ్యూహం ఉందని, పలు ఆర్ధిక నేరాల్లో ఏ1 గా వున్న జగన్ ను తాను పరామర్శించడమేమిటని పలువురు టీడీపీ నాయకులు ఆయనను వారించారని, అంతేకాదు ఒకవేళ బాబు కనుక జగన్ దగ్గరకు వెళితే అయన ప్రాభవం తగ్గుతుందని,
అంతేకాక మొదటినుండి ఏదైనా వున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనిషి అయిన చంద్రబాబు, ఈ విషయంలో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు కోరారట. కాగా చంద్రబాబు వ్యవహార శైలిని కొందరు తప్పుపడుతుంటే మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఇక నేడు ఊహించని విధంగా అన్ని పుకార్లను పటాపంచలు చేస్తూ  జగన్ కు ఫోన్ చేసారట బాబు. కొన్ని అనుకోని కారణాల వల్లనే ఇప్పటివరకు తాను స్పందించలేకపోయానని, అందుకే ఇప్పుడు ఫోన్ చేస్తున్నట్లు చెప్పారట బాబు. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు త్వరగాకోలుకోవాలి, అమ్మను, మిగిలిన వారిని అందరిని నేను కుశలం అడిగినట్లు చెప్పండి అని చంద్రబాబు చెప్పారట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది.. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here