Home వైరల్ జగన్ ను హాస్పిటల్ లో కలిసిన చిరంజీవి ఏమి చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు!

జగన్ ను హాస్పిటల్ లో కలిసిన చిరంజీవి ఏమి చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు!

0
214

నిన్న విశాఖపట్నం లోని ఎయిర్ పోర్ట్ లో హత్యా ప్రయత్నం గావించబడ్డ వైసిపి అధినేత జగన్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యాయత్నం సమయంలో జగన్ కొంత ప్రతిఘటించబట్టి, ఆగంతకుడు ఉపయోగించిన కత్తి అయన మెడను తాకిందని, లేకుంటే అది అయన మెడకు తగిలి పెద్దప్రాణానికే ముప్పు వాటిల్లేదని అక్కడి ప్రత్యక్ష సాక్షలు చెపుతున్నారు. ఇకపోతే ఎయిర్ పోర్ట్ లోనే గాయానికి ప్రధమ చికిత్స తీసుకున్న జగన్, కాసేపటికి విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్లిపోయారు. ఇక హైదరాబాద్ చేరుకోగానే, బంజారా హిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రి డాక్టర్ లు అయన గాయానికి చికిత్స అందించారు. అయితే చికిత్స అనంతరం ఆయనకు మూడు రోజులు రెస్ట్ అవసరమని చెప్పారట.

ఇక నిన్నటినుండి జగన్ ను పలువురు నాయకులు పరామర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా నిన్న లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి కాంగ్రెస్ నేత చిరంజీవి వెళ్లి పరామర్శియించి వెళ్లినట్లు సమాచారం. నిజానికి తనకు ఎంతో ఇష్టమైన ఆప్తులు రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి జగన్ కు ఇలా జరగడం తనకు బాధగా అనిపించిందని, దాడి చేసిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, అతడిని శిక్షించాలని అన్నారట. అంతేకాదు రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడికే భద్రత లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని అయన ప్రశ్నించినట్లు సమాచారం. టిడిపి అధికారాన్ని చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఇటువంటి అఘాయిత్యాలు మరియు దాడులు ఎక్కువయ్యాయని, అలానే ఇటీవల అరకు ఎమ్యెల్యేపై మావోయిస్టుల దాడి మరువకముందే మళ్ళి ఇలా జగన్ గారి పై దాడి జరగడం అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో కొంత భయానికి తావిస్తోందని అన్నట్లు సమాచారం.

కావున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగారు ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి జగన్ ను కలిసి పరామర్శించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటినుండి చిరంజీవి రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా అందరికంటే ముందుండి తనవంతుగా వారిని పరామర్శిస్తుంటారని, ఇటువంటి ఘటన నిజంగా ఒక శుభపరిణామమని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో ఆయనపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here