జగన్ పై దాడి కుట్రలు తీగ లాగితే డొంక కదులుతుంది ?

0
216
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కొద్దిరోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాప్రయత్నం ఉదంతం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది టీడీపీ కుట్ర అని వైసిపి వారు అంటుంటే, కాదు వైసిపి నాయకులే కావాలని సానుభూతికోసమే ఇలా తమ అధినేతపై హత్యాప్రయత్నం చేయించారు అనేది టీడీపీ ఆరోపణ. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అందరిలోనూ అసలు ఇది ఎవరు చేయించారు అని పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే జగన్ పై జరిగిన ఈ హత్యాప్రయత్నానికి జరిగిన కుట్ర ఇప్పటిది కాదని, ఎప్పుడూ సంక్రాంతి సమయంలో జరిగే కోడిపందాల సమయంలో శ్రీనివాస రావు స్వస్థలం ఠాణేలంక లో అతడు కోడి పందాలు నిర్వహిస్తుండేవాడని, అంతేకాదు అతడు పందెపు కోళ్లకు కత్తులు కట్టడంలో దిట్ట అని తెలిసి, అక్కడి స్థానికి టిడిపి నాయకుడు శ్రీనివాస రావుతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, ఆ తరువాత శ్రీనివాసరావుని తమకు తెలిసిన హర్షవర్ధన్ అనే టిడిపి నేత విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో నిర్వహిస్తున్న క్యాంటీన్ లో పనికి కుదిర్చాడని అంటున్నారు

అంతేకాదు ఎన్నాళ్ళనుండో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పదివేలకు మించి జీతం ఇవ్వని హర్షవర్ధన్, శ్రీనివాస రావుకు మాత్రం ఇరవై వేలకుపైగా జీతం ఇచ్చేవారని, అంతేకాక, సిబ్బంది అందరూ తమ బ్యాగులను క్యాంటీన్ లోని కిచన్ లో పెట్టుకుంటే, ఒక్క శ్రీనివాస రావు మాత్రం కెమెరాలకు కనపడని కాష్ కౌంటర్ వద్ద పెట్టేవాడిని అంటున్నారు. ఎప్పుడూ నైట్ షిఫ్ట్ లో పనిచేసే శ్రీనివాస రావు జగన్ ఘటన జరిగిన రోజున ఉదయం షిఫ్ట్ వచ్చాడని, ఇదంతా చూస్తుంటే ఒకరకముగా కుట్రగానే ఉందనేది వైసిపి ఆరోపణ. ఇక మరోవైపు అతడి స్వగ్రామంలో శ్రీనివాసరావుకు ఒక మధ్యతరగతి కుటుంబంగా పేరుండేదని, అయితే ఈ మధ్య వాళ్ళ కుటుంబం కోటిరూపాయలతో నాలుగు ఎకరాల పొలాన్ని కొనడానికి ముందుకు రావడంతో ఇంత డబ్బులు వారికి ఎలావచ్చాయా అని ఊరివారందరికి కొంత అనుమానం కూడా వచ్చిందని అంటున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే, మొదటినుండి టిడిపి నేతలతో కలిసి పక్కాగా కుట్రపన్ని, జగన్ ని హత్య చేసేందుకు కోటిరూపాయలు శ్రీనివాసరావు సుపారీ కింద తీసుకున్నాడని, తప్పకుండా కొద్దిరోజుల్లో అన్ని నిజాలు బయటకు వస్తాయని, అసలు సూత్రధారి చంద్రబాబు ఆడిస్తున్న నాటకాలు అన్ని బయటకు వచ్చాక, టీడీపీ బండారం ప్రజలకు తెలుస్తుందని అంటున్నారు..

జగన్ కేసు లో అసలు నిందితురాలు ఈమెనే గుట్టు రట్టు చేసిన పోలీసులు|#YsJagan|#Srinivas|GARAM CHAI

 

జగన్ పై దాడి లో బయటపడ్డ కొత్త ట్విస్ట్ సిట్ విచారణలో ఇద్దరు మహిళలు చెప్పినషాకింగ్ నిజాలు|GARAM CHAI