జగన్ పై దాడి కేసులో పోలీసులపై ఫైర్ అయిన షర్మిల…మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు….!

0
271

ఇటీవల వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లోని వెయిటర్ శ్రీనివాస్ హత్య యత్నానికి పాల్పడ్డ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే శ్రీనివాస్ దాడి చేసిన సమయంలో అతడి చేతిలోని కత్తి జగన్ భుజానికి తగిలి కొద్దిపాటి గాయం అయింది. ఇక ఎయిర్ పోర్ట్ లోనే ప్రధమ చికిత్స తీసుకున్న జగన్, అక్కడి నుండి ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకొని, బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో గాయానికి చికిత్స తీసుకున్నారు. ఇక ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న జగన్ ను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు శ్రీనివాస్ మాత్రం తాను ఈ హత్యాయత్నం కావాలనే చేసానని, నిజానికి తాను జగన్ వీరాభిమానినని, ఈ విధంగా చేస్తే జగన్ కు సానుభూతి వస్తుందని చేశాను అని పోలీసులు అతని నుండి స్వాధీనం చేసుకున్న లెటర్ లో వుంది.

ఇక ఇదంతా టీడీపీ కుట్రలో భాగమని, సీఎం చంద్రబాబు సహా టిడిపి నాయకులందరూ ఈ కుట్రలో భాగస్తులై వున్నారని వైసిపి విమర్శలు చేస్తోంది. ఇక శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని మొన్న ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే శ్రీనివాస్ మాత్రం తనకు ప్రాణహాని ఉన్నట్లు మీడియా వారికి చెపుతున్నట్లు తెలుస్తోంది. ఇక తన అన్నపై ఇంత కుట్రపన్నిన ప్రతిఒక్కరిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు జగన్ చెల్లెలు షర్మిల. ఆమె మాట్లాడుతూ, ఒకరకంగా టిడిపి నాయకులు అంతా కలిసి తమ కుటుంబంపై కుట్రపన్ని ఈ దాడి చేయించారని, అంతేకాదు కొంతమంది పొలిసు ఉన్నత అధికారులు కూడా ఈ కుట్రలో భాగమై వున్నారని ఆమె మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నంత మాత్రాన పోలీసులు సహా, మిగతా అధికారులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న టిడిపికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వారికి తప్పకుండ బుద్ధి చెపుతారని ఆవేదన వ్యక్తం చేశారట.
నీతికి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే పోలీసులు, ప్రభుత్వం చెప్పినట్లు చేయడమేంటనీ, అయినా శ్రీనివాస్ జేబులో 11 పేజీల లేఖను టిడిపి అండదండలతోనే పోలీసులు శ్రీనివాస్ జేబులో పెట్టించారని ఆమె ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చట్టం నుండి మరియు న్యాయస్థానం నుండి ఎవరూ తప్పించుకోలేదని, నిజం, న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుందని, ఈ దుర్ఘనటకు బాద్యులైన ప్రతిఒక్కరు త్వరలోనే కఠిన శిక్ష అనుభవిస్తారని ఆమె ఆగ్రహించినట్లు సమాచారం. చూస్తుంటే షర్మిల తన అన్న పరిస్థితికి కారణమైన వారికి దేవుడు తప్పక శిక్ష విధిస్తాడని గట్టిగా నమ్మినట్లు తెలుస్తోంది. అయితే చూడాలి మరి మున్ముందు ఈ కేసు ఏవిధంగా ముందుకుపోతుందో.

 

జగన్ కి ఫోన్ చేసిన చంద్రబాబు ఏం మాట్లాడాడో తెలిస్తే షాక్ అవుతారు|#YsJagan|#Chandrababu|GARAM CHAI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here