జగన్ పై దాడి ఘటనలో భయంకర నిజాలు బయటపెట్టిన శ్రీనివాస్!

0
270
నేడు వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఒక ఆగంతకుడు దాడి చేసిన విషయం రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడి చేసింది ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి అని తెలుస్తోంది. అతడు జగన్ వద్దకు సెల్ఫీ కోసం వచ్చి హత్యచేయడానికి ఎందుకు ప్రయత్నించాడనేది అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న. నిజానికి జగన్ పై దాడి సమయంలో అతడు దూసిన కత్తి, జగన్ భుజాన్ని తాకిందని, లేకపోతే అది అయన మెడకు తగిలి  ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదనేది ప్రత్యక్షసాక్షులు కథనం. ఇకపోతే దాడి అనంతరం శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకు అతడిపై విచారణ చేపట్టారు. ఇక అతడిని విచారించే క్రమంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయని, అవి విన్న పోలీసులు షాక్ కు గురి అయినట్లు తెలుస్తోంది.
ఇక అతడు చెప్పినదాన్ని బట్టి చూస్తే, శ్రీనివాస్ అమలాపురానికి చెందివాడని, తన జీవనం నిమిత్తం విశాఖ ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో వెయిటర్ గా ఉద్యోగంలో చేరాడట. అంతేకాదు అతడు చేరి నెలరోజులు కూడా కాలేదని, అతడిని ఆ ఉద్యోగంలోకి తీసుకుంది ఆ క్యాంటీన్ యజమాని మరియు టిడిపి వ్యక్తి అయిన హర్షవర్ధన్ అని చెప్పాడట. వాస్తవానికి తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ లు అంటే అమితమైన ప్రేమ అని, ఇదివరకు జగన్ మోహన్ రెడ్డి గారు తమ ప్రాంతానికి ప్రజాసంకల్ప యాత్ర సమయంలో విచ్చేసినపుడు తనవద్ద డబ్బులు లేనప్పటికీ, అప్పు చేసిమరీ తాను జగన్ కు ఫ్లెక్సీలు కట్టానని, అటువంటి నేను కొద్దిరోజులనుండి జగన్ ను కలుద్దామన్నా కుదరలేదని, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన యొక్క అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో తాను కొంత ఆవేదనకు గురయ్యానని చెప్పాడట.
కాగా అనుకోకుండా జగన్ గారు విశాఖ విమానాశ్రయానికి రావడంతో ఒక్కసారిగా ఆయనను చూసిన తనకు జరిగిన ఘటనపై కొంత కోపం వచ్చిందని, అందుకే జగన్ గారివద్దకు సెల్ఫీ పేరుతో వెళ్లి ఆయనపై దాడి చేసానని చెప్పాడట. అయితే నిజానికి తాను జగన్ గారి ప్రాణాలు తీయాలని అనుకోలేదని, కేవలం ఆయనపై తనకోపాన్ని చూపించడానికి భుజంపై పొడిచానని చెప్పాడట. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ ని  విచారిస్తున్న పోలీసులు అతడినుండి మరికొన్ని విషయాలు రాబట్టే పనిలో వున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here