జగన్ పై దాడి నిందితుడు శ్రీనివాస్ ని కలిసిన షర్మిల ఏమి మాట్లాడిందో తెలిస్తే షాక్ అవుతారు!

0
228
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం ఘటనపై పలువురు మండిపడుతున్నారు. ఇక ఈ దుర్ఘటన జరుగగానే జగన్ తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు జగన్ కు ఏమైందో అని విపరీతంగా మధనపడ్డారని, అయితే ఆయన భుజానికి కొద్దిపాటి గాయం మాత్రమే అవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారట. ఇక హైదరాబాద్ వచ్చి సిటీ న్యూరో ఆసుపత్రిలో గాయానికి చికిత్స చేయుంచుకున్న జగన్ ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్ పై ఇంతటి ఘోరానికి పాల్పడిన శ్రీనివాస్ నుండి ఇప్పటికే పలు నిజాలు రాబట్టే పనిలో వున్నారు పోలీసులు. అయితే నేడు శ్రీనివాస్ ని ఉంచిన పోలీస్ స్టేషన్ కు ఊహించనివిధంగా జగన్ చెల్లెలు షర్మిల వెళ్లి కలిసారట.
అతడిని కలిసిన షర్మిల, అసలు ఎవరు నువ్వు, ఎందుకు జగన్ గారిపై ఇంతటి ఘోరానికి ఒడిగట్టావు అంటూ పలువిధాలుగా ప్రశ్నలు సంధించారట. అంతేకాదు, అయన పై నువ్వు చేసిన ఈ దాడి వెనుక ఎవరు వున్నారు, నీవు కనుక నిజం చెపితే ఎటువంటి శిక్షపడకుండా మేము చూస్తాము అంటూ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అసలు నీ స్వస్థలం ఎక్కడ, ఎన్నాళ్ళనుండి విశాఖ ఎయిర్ పోర్ట్ లో చేరావు అనే పలు విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారట. నిజానికి తాను స్టేషన్ కు వచ్చింది శ్రీనివాస్ ని బెదిరించడానికి కాదని, అతడినుండి అసలు నిజాన్ని రాబట్టడానికని షర్మిల అక్కడి పోలీస్ అధికారులతో చెప్పారట. అయితే షర్మిల ఎంత బ్రతిమిలాడినప్పటికీ కూడా శ్రీనివాస్ అసలు నిజం చెప్పలేదని, నిజానికి జగన్ పై తాను దాడికి పాల్పడినప్పటికీ కూడా షర్మిల గారు వచ్చి తనను కలవడం చాలా గొప్ప విషయమని శ్రీనివాస్ పోలీస్ అధికారులతో చెప్పాడట.
ఇక షర్మిల కూడా తన ఆవేదన అంతా ఈ ఘోరానికి కారకులైన

అసలు నిందితుల పేర్లు తెలుసుకోవడమేనని, ఎందుకంటే ఇంత చిన్న కుర్రాడు అన్నయ్యపై కావాలని దాడి చేసాడంటే నమ్మశక్యంగా లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారట. ఇక ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. కాగా షర్మిల నిందితుడిని కలవడం ప్రస్తుతం గోప్యంగా ఉంచారని, అయితే త్వరలోనే షర్మిల కలిసిన విషయమై పూర్తివివరాలు బయటకువస్తాయని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత సమయం వేచిచూడవలసిందే……..