జగన్ హత్యాయత్నం నిందితుడు శ్రీనివాస్ ఇంట్లో విషాదం…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు

0
161
ఇటీవల వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాస్ అనే వెయిటర్ కత్తితో దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు శ్రీనివాస్ జగన్ తో సెల్ఫీ కోసం కోసం రావడం, అతనిని సెల్ఫీ కోసం జగన్ సాదరంగా ఆహ్వానించడం, ఆపై అతడు తన జేబులొనించి ఒక కత్తి తీసి దానితో జగన్ పై హత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఆ కత్తి జగన్ భుజానికి గుచ్చుకుంది. అయితే ఆ సమయంలో జగన్ కొంత పక్కకు తప్పించుకోబట్టి అది భుజానికి తగిలిందని, లేకపోతే అయన మెడకు పెద్ద గాయమయి, ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదనేది అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు కథనం. ఇక వెంటనే నిందితుడు శ్రీనివాస్ ని ఎయిర్ పోర్ట్ అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఆ తరువాత శ్రీనివాస్ జేబులో ఒక 11 పేజీల లేఖను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. అందులో తాను జగన్ గారి అభిమానినని, అయినప్పటికీ కొన్నాళ్ళనుండి జగన్ గారిని కలవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో, ఆ తరువాత ఆయన ఎయిర్ పోర్ట్ కి రావడంతో కత్తితో ఆయన్ను హత్యచేయాలని ప్రయత్నిచినట్లు ఆ లేఖలో వుంది. ఇక శ్రీనివాస్ తల్లితండ్రులను విచారించిన పోలీసులు, అతని తల్లితండ్రులపై దురుసుగా ప్రవర్తించారని అంటున్నారు. ఇకపోతే తన కుమారుడు ఈ విధంగా జగన్ గారిపై హత్యాయత్నం చేయడం, ఊళ్ళో తమ పరువుపోయి, ప్రతిఒక్కరు తమని తప్పుగా చూడడం, మరోవైపు పోలీసుల వేధింపులు, ఇలా ఈ వరుస సమస్యలతో సతమతమైన శ్రీనివాస్ తల్లి, మానసిక వేదనతో ఆవేదన చెంది మంచంపట్టినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ ఇలా చేస్తాడని తాను ఊహించలేదని, ఇటువంటి ఘటన తనను పూర్తిగా బాధపడి, ఆవేదనతోనే ఆమె ఇలా అయిందని అతని మిగతా కుటుంబ సభ్యులు చెపుతున్నారు. ఇక ప్రస్తుతం జైల్లో వున్న శ్రీనివాస్, తన తల్లి ఇలా మంచాన పడిన విషయం తెలుసుకుని తాను కూడా ఆవేదన చెందుతున్నాడట. అంతేకాదు వీలైతే తన తల్లిని చూడడానికి పర్మిషన్ ఇప్పించాలని కూడా కోరినట్లు సమాచారం. కాగా నిందితుడి తల్లిని చూడటానికి పెట్టుకున్న పిటీషన్ పై పొలిసు అధికారులు ఆమెను చూడడానికి అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి….