జగన్ హత్యాయత్నం నిందితుడు శ్రీనివాస్ సంచలన నిర్ణయం!

0
131
గత ఐదు రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నం కేసులో పలు విధాలుగా ఊహాజనిత వాదనలు వినపడుతున్నాయి. కొందరేమో ఇది టిడిపి పన్నిన కుట్రలో భాగమని అంటుంటే మరికొందరు మాత్రం ఎన్నికలవేళ సానుభూతికోసం ఇది వైసిపి నాయకుల నాటకమని అంటున్నారు. ఇక ఈ విషయం అటుంచితే, విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అతడిని ప్రశ్నించిన పోలీసులు అతడి పూర్వాపరాలు, మరియు అతడి బాల్యం, మరియు ఇతరేతర విషయాలను కూపీలాగుతున్నారు. 
అయితే నాలుగు రోజులుగా పోలీసుల కస్టడీలో వున్న శ్రీనివాస్ మాత్రం ఈ హత్యాప్రయత్నం తాను కావాలని చేయలేదని అంటున్నాడని, అయినప్పటికీ పోలీసులు అతన్ని నేరం ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా వినపడుతోంది. ఇక శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా అతడికి ఏ పాపం తెలియదని, అతడు ఎందుకు అసలు అలా జగన్ గారి మీద హత్యాయత్నానికి ప్రయత్నించాడో ఇప్పటికీ అర్ధం కావడం లేదని అంటున్నారు. ఇకపోతే ప్రస్తతం అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్లో పోలీసులు తనను నానా విధాలుగా హింసిస్తున్నారని, అందుకే ఆ బాధలు భరించలేని శ్రీనివాస్ నేడు జైలు నుండి పారిపోయే ప్రయత్నం చేసాడని అంటున్నారు. నిజానికి శ్రీనివాస్ పోలీసులకు వున్నది ఉన్నట్లు చెప్పినప్పటికీ వారు మాత్రం అతన్ని పలువిధాలుగా హింసించడం తట్టుకోలేక జైల్లోనుండి పారిపోయే ప్రయత్నం చేసాడని,
అయితే అతడి ప్రయత్నం విఫలం కావడంతో అతడు మళ్ళి పోలీసులకు చిక్కాడని, అక్కడినుండి అతడికి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసిందట పొలిసు శాఖ. అయితే ప్రస్తుతం ఈ వార్తను బయటకు రాకుండా కొందరు పొలిసు ఉన్నతాధికారులు జాగ్రత్తవహించారని, కానీ కొందరు మీడియావర్గాల ద్వారా ఈ వార్త బయటకు వచ్చిందని అంటున్నారు. మరి ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం, పొలిసు శాఖ నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడవలసిందే……