జగపతిబాబు భార్య నిజస్వరూపం తెలిస్తే షాక్ అవుతారు!

0
276
తెలుగు సినిమాల్లో అక్కినేని, శోభన్ బాబు తరువాత అప్పట్లో మహిళల ఫాలోయింగ్ సంపాదించిన నటుడు ఎవరంటే మనకు ముందుగా గుర్తుకువచ్చే పేరు జగపతిబాబు. నిజానికి జగపతిబాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ పెద్ద టాలీవుడ్ సినిమా నిర్మాత. అయన తెలుగులో ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ లతో చాల సినిమాలు నిర్మించారు. ఇక ఆయన కుమారుడిగా స్వప్నలోకం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, మెల్లగా తన మార్కు నటనతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత అయనకు కుటుంబ నేపథ్యం వున్న సినిమాలు వరుసగా రావడం మొదలెట్టడంతో ఆ సమయంలో అయన మహిళలు మెచ్చిన హీరోగా మంచి పేరు సంపాదించారు. ఇకపోతే కొన్నేళ్లుగా అక్కడక్కడా తప్పితే పెద్దగా సినిమాలు చేయని జగపతి బాబు, బాలకృష్ణ మరియు బోయపాటిల లెజెండ్ సినిమా తో విలన్ గా మారారు. ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడంతో, అక్కడినుండి దాదాపుగా ఆయనకు అటువంటి పాత్రలే రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం అయన కొన్ని పెద్ద సినిమాల్లో కూడా విలన్ గా నటిస్తూ అలరిస్తున్నారు.
ఇకపోతే జగపతిబాబు వ్యక్తిగత జీవితం గురించి మనలో చాలామందికి తెలియదనే చెప్పాలి. నిజానికి అయన పెళ్లి కూడా గమ్మత్తుగా జరిగిందట. ఆయన వివాహం చేసుకుంది, తనకు దగ్గరి బంధువుల అమ్మాయినే అట. మొదట జగపతిబాబుని విశాఖపట్నంలోని తన ఫ్యాక్టరీ లో పనిచేస్తుండగా తొలిసారి చూసిన ఆయన భార్య లక్ష్మి, తొలి చూపులోనే ఆయనతో ప్రేమలో పడిందట. మొదటినుండి కొంత కోపిష్టిగా వుండే జగపతి బాబుని చాలావరకు మార్చిన ఘనత లక్ష్మి కె దక్కుతుందని వారి సన్నిహితులు చెపుతున్నారు. ఇక వారిద్దరూ  ప్రేమించుకున్నాక, మొదట్లో వారి ప్రేమను ఇద్దరు కుటుంబాలు ఒప్పుకోలేదని, అయితే ఒకరోజు జగపతి బాబు తన ఆఫీస్ లోని ఒక పిట్ట గోడపై కూర్చుని ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటూ ఉండగా, ఒక్కసారిగా గోడపై నుండి పడి, గాయాలపాలయ్యారట. అయితే వారిద్దరి పెళ్ళికి తాము ఒప్పుకోకపోవడం వల్లనే జగపతి ఆత్మహత్య ప్రయత్నం చేసాడేమో అని భావించిన అయన తల్లితండ్రులు, వెంటనే లక్ష్మితో అయన వివాహాన్ని జరిపించారట.
ఇక లక్ష్మి గారి గురించి జగపతి బాబు ఎక్కడికి వెళ్లినా ఎంతో గొప్పగా చెపుతారని అంటున్నారు. ఆమె తన జీవితంలో ప్రవేశించిన తరువాత తనకు సినిమా అవకాశాలు మరింతగా పెరిగాయని, అంతే కాదు తనకు కెరీర్ లో కొన్ని సమస్యలు ఎదురైనపుడు ఆమె దగ్గరుండి తనకు సరైన సలహాలు ఇచ్చి ముందుకు నడిపించేదని జగపతి అంటుంటారు. అంతేకాదు తాను సినిమాల్లో మంచి బిజీగా వున్న సమయంలో తమ పిల్లల్ని భార్య లక్ష్మి, ఎంతో జాగ్రత్తగా తనలోటు తెలియకుండా చూసేవారని, ఈ రోజుకి కూడా మా కుటుంబం ఎటుంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉందంటే దానికి కారణం లక్ష్మి అనేది అయన మాట. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఇంటికి దీపం ఇల్లాలే, అనేవిధంగా జగపతి బాబు భార్య లక్ష్మి తమ ఇంటిని ఎంత చక్కగా సరిదిద్దుకున్నారో. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here