జబర్దస్త్ కమెడియన్ ఆత్మహత్యయత్నం….మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
304
ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అవడంతో దాదాపుగా ప్రతిఒక్కరు తమకు సంబందించిన ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. అయితే కొందరు ప్రముఖులు కూడా తమ నిత్య జీవితంలో జరిగే విషయాలు కూడా వీడియోల రూపంలో సాధారణ ప్రజలకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ వారికి మరింత చేరువ అవుతున్నారు. ఇక మరికొందరు అయితే ఫన్నీ గా ఆటపట్టిస్తూ పెడుతున్న వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూరోజురోజుకు మంచి క్రేజ్ తో దూసుకెళుతున్న షో జబర్దస్త్. ఇక ఈ షోలోని నటీనటులు కూడా తమ వ్యక్తిగత విషయాలు మరియు సరదా ఘటనలు వీడియో లు తీస్తూ ఎప్పటికపుడు తమ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే నేడు జబర్దస్త్ లో తన పంచులతో, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఆటో సౌండ్ తో మంచి పాపులరైన ఆటో రామ్ ప్రసాద్, తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఒక వీడియో ప్రజలను కొంత ఆందోళనకు గురిచేసింది. అయితే పూర్తి వీడియో చూస్తే అది ఒక ఫన్నీ వీడియో అని అర్ధం కాదు.

ఇక మ్యాటర్ లోకి వెళితే రామ్ ప్రసాద్ పోస్ట్ చేసిన వీడియోలో తనకు ముందుగా ఆది, మరియు సుధీర్ నుండి ఫోన్ వస్తుంది. ఏంటి నేను మళ్ళి స్కిట్స్ రాయాలా? ఇప్పటికే జబర్దస్త్ లో స్కిట్స్ , పంచ్ డైలుగులు రాసి నా పని పూర్తిగా అయిపోయింది. ఇక మళ్ళి మరొక స్కిట్ కి డైలాగులు రాయాలంటే నావల్ల కాదు, ఇక నేను బ్రతకలేను అంటూ తన పక్కనే వున్న బావిలో దూకుతాడు, అది చూసిన వెంటనే మనకు కొంత భయం వేస్తుంది. అయితే ఒక పది సెకన్ల తరువాత, దగ్గరకి వెళ్లి చూస్తే అది బావి కాదు, ఒక షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన డమ్మీ బావి అని అర్ధం అవుతుంది.  కెమెరా బావిలోకి చూపించగానే, అందులో రామ్ ప్రసాద్ హాయిగా ఫోన్ వాడుతుండడం కనపడుతుంది. ఏరా ఏంటిది, అనగానే, ఏమి లేదురా అందరిని సరదాగా భయపెడదాం అని ఇలా ఫన్నీ వీడియో చేశాను అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here