జబర్దస్త్ కి ఆది రాకపోవడానికి రైజింగ్ రాజునే కారణమా?

0
297
ఈటివి ఛానల్ లో ప్రసారమవుతూ రోజురోజుకు మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న షో జబర్దస్త్. ఇక వాస్తవం చెప్పాలంటే ఒక రకంగా ఈ షో ప్రారంభం తరువాతనే ఆ ఛానల్ వారికి టిఆర్పిలు విపరీతంగా పెరిగాయి. ఇక ఈ షోలో హైపర్ ఆది, బులెట్  భాస్కర్, చలాకి చంటి, రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, అదిరే అభి, గెటప్ శ్రీనుల స్కిట్ లకు ఎక్కువగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తుంటాయి. ఇక అందులో అందరికంటే మరింత ఎక్కువగా వచ్చేది హైపర్ అది స్కిట్స్ కె అని చెప్పాలి. ఆది వేసే పంచ్ డైలాగులకు ఎంతటివారికైనా నవ్వు రావలసిందే. అంతలా అతని స్కిట్స్ తెలుగువారికి చేరువయ్యాయి. అయితే గత కొద్దిరోజులుగా ఆది జబర్దస్త్ షోకి రాకపోవడంతో ఆయనకు యాక్సిడెంట్ అయిందని, ఆయనకు ఆరోగ్యం బాలేదని, మరికొందరైతే అయన రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచడంతో ఆ ఛానల్ వారే ఆయనను షో నుండి తప్పించారు అంటూ పలు రకాల పుకార్లు సోషల్ మీడియా వేదికల్లో షికారు చేశాయి.
అయితే ఆ తరువాత తనకు ఏమి కాలేదు, బాగానే వున్నాను, కాకపోతే ఎక్కువగా సినిమా అవకాశాలు రావడం వల్లనే తాను జబర్దస్త్ లో పాల్గొనలేకపోతున్నాను అంటూ ఆది మీడియాకు తెలిపారు. ఇక ఆది రాకపోవడానికి నేనే కారణమంటూ రైజింగ్ రాజు నిన్నటి షోలో చెప్పిన విషయం తెలిసిందే. కాగా దానికి ఒక ప్రధానమైన కారణం ఉందని అంటున్నారు. అది ఏంటంటే, నిజానికి ఎప్పటినుండో ఆది స్కిట్స్ లో పాల్గొంటున్న రాజుకు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు అనే చెప్పాలి. కేవలం అది పంచ్ లకే కాక, రాజు పెర్ఫార్మన్స్ కు కూడా వాళ్ళ స్కిట్స్ లో మంచి మార్కులు పడతాయి. ఇకపోతే ఈ మధ్య ఒక స్కిట్ విషయమై వారిద్దరి మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చాయని, స్కిట్స్ బాగా ప్రేక్షకులకు చేరువ అవుతుండడంతో ఎక్కువ క్రెడిట్ నీకే వెళ్తోంది, నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ రాజు ఆది పై ఫైర్ అయ్యాడట.
నిజానికి తన పంచ్ లు మరియు స్కిట్స్ బాగుండడం వల్లనే ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని, అంతేతప్ప నేను ఎక్కువ, నువ్వు తక్కువ అని తానెప్పుడూ అనుకోలేదని ఆది చెప్పాడట. అయినప్పటికీ వినిపించుకొని రాజు, ఇకపై నువ్వు సినిమాలే చేసుకో, జబర్దస్త్ గురించి నీకు  అనవసరం,నా పాట్లు నేను పడతాను అంటూ బయటకు వచ్చి, తన స్కిట్స్ తానే రూపొందించుకుని నటిస్తున్నాడట. కాగా ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని ప్రస్తుతం ఇది కొన్ని మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here