జబర్దస్త్ కి రాకపోవడానికి అనసూయ చెప్పిన కారణం తెలిస్తే షాక్ అవుతారు!

0
336
బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించిన షోల్లో ఈటివి లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ఒకటి. నిజానికి ఆ షో ప్రసారమైన తరువాత ఈటివికి టిఆర్పి రేటింగ్స్ మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. ఆ షోలో హైపర్ ఆది, చలాకి చంటి, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ ల స్కిట్స్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ షో తాలూకు ఒక్కొక్క ప్రోమోకి కానీ, వీడియో కి కానీ దాదాపుగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయంటే షో పై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ షోలో కేవలం స్కిట్స్ చేసే నటీనటులు మాత్రమే కాదు, షోలో యాంకరింగ్ చేసే అనసూయ మరియు రష్మీ లు కూడా తమ యాంకరింగ్ షోకి మంచి పేరు తీసుకువచ్చారని చెప్పాలి. అయితే ఈ షోకి మొదట్లో అనసూయ యాంకర్ గా చేసి షో కి మరింత పాపులారిటీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత రష్మీ ఆమె స్థానంలో యాంకరింగ్ చేసింది.

ఇకపోతే ప్రస్తుతం కొన్నాళ్ళనుండి షోకి వస్తున్న అనసూయ, రెండు మూడురోజులుగా రాకపోవడం, ఆమె స్థానంలో వర్షిణి రావడంతో, అనసూయకు ఆరోగ్యం బాలేదని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే, మరికొందరేమో ఆమెకు మరియు షో నిర్వాహకులకు కొంత గొడవ అయిందని, దానివల్ల ఆమె షో నుండి పూర్తిగా తప్పుకుందని పలురకాల పుకార్లు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అనసూయ జబర్దస్త్ షోకి రాకపోవడానికి కారణం కొంత తీరిక లేని షూటింగులని సమాచారం. ఆమె ఇటు షోలతో పాటు అటు సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను ఒప్పుకున్న సినిమాల తాలూకు షూటింగ్లు వుండడడం వలన రెండు మూడు రోజులు జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చిందని, అందుకే ఆమె స్థానంలో వర్షిణి ని తీసుకున్నారని, అవి పూర్తి అవగానే ఆమె మల్లి తిరిగి షోలో యధావిధిగా పాల్గొంటుందని తెలుస్తోంది. అయితే అనసూయ షోకి రాకపోవడం పై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, తన ఆరోగ్యం పరిస్థితి బాగుందని, కాబట్టి ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అనసూయ అంటోంది. మరి ఇప్పటికైనా ఆమె పై వస్తున్న ఈ పుకార్లకు అడ్డుకట్ట పడుతుందో, లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here