జబర్దస్త్ కు నాగబాబు రాకపోవడం పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన రోజా!

0
316
ఏదైనా సినిమా కానీ లేదా షో కానీ పాపులర్ అయితే దానికి వచ్చే ప్రేక్షకుల మద్దతు మరియు రేటింగ్స్ రోజురోజుకూ పెరుగుతుంటాయి. అంతేకాదు వాటికి సంబంధించి అనుకోకుండా ఏమైనా నెగటివ్ న్యూస్ వచ్చినా, అదికూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈటివి ఛానల్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ షోకి సంబంధించి ఒక విషయంపై ఎవరి నోటా విన్నా ఒకటే చర్చ జరుగుతోంది. అదేమిటంటే, షోలో నాగబాబు పాల్గొనకపోవడంపై పలురకాల కథనాలు కొన్ని మీడియా వర్గాల్లో పుకారు రేపుతున్నాయి. అయితే నిజానికి నాగబాబు గారు షోకి రాకపోవడానికి గల అసలు కారణాన్ని తెలుసుకోకుండా ఎవరికి ఇష్టంవచ్చినట్లు వారు రాయడంపై ఆ షోలో నాగబాబుతో పాటు మరొక జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా నేడు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మీడియావారిపై ఫైర్ అయిందట. వాస్తవాలు తెలుసుకోకుండా నాగబాబు గారిపై మీకు ఇష్టంవచ్చినట్లు మీరు ఎలా రాస్తారు, మమ్మల్నో లేక అయన కుటుంబ సభ్యులనో లేకపోతే కనీసం షో నిర్వాహకులనో అయినా అడిగితెలుసుకోవాలి కదా అంటూ మందలించారట.
ప్రస్తుతం నాగబాబు గారి ఆరోగ్యం బాలేదని, ఆయనకు ఏదో అయిందని, పైగా సీరియస్ గా కూడా ఉందని వస్తున్న వార్తలన్నీ కూడా తప్పులని, అసలు నాగబాబు గారికి వచ్చిన ప్రమాదం ఏమి లేదని అన్నారట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ఆయనకు వరుసగా కొన్ని సినిమాల షూటింగులు వున్న కారణంగా, మరియు వాటికి డబ్బింగ్ చెప్పడం వంటి పని ఒత్తిడి కారణంగా ఆయన శారీరకంగా కొంత ఇబ్బంది పడ్డట్లు చెప్పారు. అంతేకాదు అలా వరుసగా సినిమాలకు డబ్బింగ్ చెప్పడంవలన అయన గొంతు కూడా కొంత నొప్పిచేసిందని, వీటిమూలంగా డాక్టర్లు ఆయనకు కొన్నాళ్లపాటు విశ్రాంతి అవసరం అని చెప్పారని,
అందుకే కొద్దిరోజులవరకు అయన షూటింగ్లులకు కానీ షోలకు కానీ వెళ్లడం లేదని చెప్పారట. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు మీడియా వారు తప్పుడు రాతలు రాస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు వార్తలను ఆపి, వాస్తవాలను ప్రజలకు తెలియచేయండి అని ఆమె చెప్పినట్లు సమాచారం. ఇక నేడు రోజా, నాగబాబుకి ఏమి కాలేదని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికల్లో సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here