టాలీవుడ్ లో మరో భారీ బయోపిక్ రెడీ…మెగాస్టార్ బయోపిక్ కి రంగం సిద్ధం!

0
372
ప్రస్తుతం భారత దేశంలోని పలు చిత్ర రంగాల్లో బయోపిక్ ల కాలం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అటు బాలీవుడ్ లో మిల్కా సింగ్ బయో పిక్ గా వచ్చిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంజు సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక మరోవైపు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయో పిక్ గా వచ్చిన ఎమ్ ఎస్ ధోని సినిమా కూడా మంచి హిట్ అయింది. పోతే ఇటీవల తెలుగులో లెజెండరీ నటుడు మరియు రాజకీయ నాయకుడు దివంగత శ్రీ ఎన్ టి రామారావు గారి బయోపిక్ ఎన్టీఆర్ మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర పేరుతో ఒక బయోపిక్ రూపొందుతోంది.
అయితే త్వరలో భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ బయోపిక్, ఇక బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్, అలానే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మ జయలలిత బయోపిక్ లు కూడా మొదలు కానున్నాయి.  అయితే ఇక అతి త్వరలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే కథ, స్క్రిప్ట్ మరియు ఇతర కార్యక్రమాలు మొదలయ్యాయని, టాలీవుడ్ లోని ఇద్దరు ప్రముఖ కథా రచయితలు దానిపై ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించారట. అలానే ఒక ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక అన్నిటికంటే ముఖ్యవిషయమైన ఈ సినిమా బయోపిక్ లో హీరోని వెతికేపనిలో నిమగ్నమయిందట ఆ నిర్మాణ సంస్థ. నిజానికి ఈ విషయం ఇప్పటివరకు బయటకు రానప్పటికీ అన్నిపనులు వేగంగా జరిగిపోతున్నాయట.
ఇకపోతే సినిమాని ఇటీవల చాలారోజుల తరువాత ఒక సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఈ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి బాల్యం, యుక్త వయసు, తరువాత సినిమాల్లోకి ప్రవేశం, సినిమాల్లో అయన మంచి హీరోగా దూసుకెళ్లడం, మెల్లగా సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ గా ఎదగడం వంటివి అన్నీ చూపించనున్నారట. అంతేకాదు సినిమాలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అంశం కూడా ఉండబోతోందని, ఇకపోతే అయన తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్ పాత్రలకు కూడా సరిగ్గా సరిపోయే వ్యక్తులను కూడా ఎంపిక చేసేపనిలో ఉన్నారట. ఇక ఈ విషయమై త్వరలోనే ఆ నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వార్త ఒకవేళ  నిజమేఅయినట్లయితే మాత్రం మెగా అభిమానులకు ఇక పండుగ అనే చెప్పుకోవాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here