ఢీ జోడి నుండి తప్పుకున్న రష్మీ…..ఇదిగో ప్రూఫ్,,,,మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
264
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న షో ఢీ జోడి. ఈ షో ప్రారంభం సమయంలో బిగ్ బాస్ షో తో మంచి పాపులరైన భానుశ్రీని యాంకర్ గా తీసుకున్నారు షో నిర్వాహకులు. అయితే ఈ సీజన్ లో ఎప్పటివలె సుధీర్ మేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఫిమేల్ హోస్ట్ గా మాత్రం రేష్మి ని తొలగించి నిర్మాతలు, ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన భానుశ్రీని తీసుకున్నారు షో నిర్వాహకులు. అయితే ఈ షో మొదలెట్టిన దగ్గరినుండి ఎంతోమంది ప్రేక్షకులు భానుశ్రీ యాక్టింగ్ బాగుందని కితాబిస్తున్నప్పటికీ కూడా, మళ్ళి రేష్మి నే సుధీర్ ప్రక్కన జోడిగా తీసుకోవాలని విపరీతంగా కామెంట్స్ చేయడం, అదీ కాక ఇదివరకటితో పోలిస్తే షోకి ప్రస్తుతం కాస్త తక్కువ రేటింగ్ రావడంతో చివరికి ఆ షో నిర్మాతలు మళ్ళి రేష్మినే తీసుకోవాలని నిర్ణయించారు.
అయితే రేష్మి పునరాగమనంతో షో మొత్తం మంచి జోష్ తో ముందుకు సాగుతోంది. కాగా ఈ వారం షోకి సంబందించిన ప్రోమోని నేడు విడుదల చేసారు నిర్వాహకులు. ఇక ప్రోమోని బట్టి చూస్తే, ఈ వారం 24కిస్సెస్ సినిమా హీరో, హీరోయిన్లు హెబ్బాపటేల్, ఆదిత్  అరుణ్ లు షోలో సందడి చేశారు. ఇక ఎప్పటిలానే షోలో కంటెస్టెంట్లు తమ అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో జడ్జెస్ తో పాటు అందరిని ఆకట్టుకున్నారు. ఇక సుధీర్ హెబ్బాని చూసి సిగ్గుపడడంతో, నువ్వు అలా సిగ్గు పాదకురా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ప్రదీప్ అనడంతో షోలో వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. ఇక ప్రోమో చివరిలో శేఖర్ మాస్టర్ కొందరు డాన్సర్లు తో కలిసి డాన్స్ చేయడం, అది చూసిన శేఖర్ మాస్టర్, స్టేజిపైకి వచ్చి తాను కూడా అతడితో కలిసి డాన్స్ చేసి అలరించారు. అయితే ఈ ప్రోమోలో ఒక విషయాన్నీ పరిశీలిస్తే, రేష్మి ఈ వారం షోకి రాలేదని అర్ధం అవుతుంది. నిజానికి ఈ వారమే రాలేదా, లేక ఇకపై షోకి రాకుండా పూర్తిగా తప్పుకుండా అని ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు మొదలవుతున్నాయి. అయితే కొన్ని మీడియావర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రష్మీ ఈ షో నుండి పూర్తిగా తప్పుకుందని అంటున్నారు. దానికి ఒక ప్రధానమైన కారణం ఉందని, నిజానికి ఆమెకు ప్రస్తుతం ఎక్కువగా సినిమాల ఆఫర్లు వస్తున్నాయని, వాటికి డేట్లు కేటాయించడంతో, ఈ షోకి కావలసిన డేట్, టైం ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ చేయలేని పరిస్థితి వచ్చిందని, అందువల్లనే ఆమె షోనుండి తప్పుకుంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here